చేయకూడని తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాడో మరో సెలబ్రిటీ. లైంగిక వేధింపుల మీద ఇటీవల కాలంలో జరుగుతున్న రచ్చ అంతాఇంతా కాదు. ఆచితూచి అడుగులు వేయాల్సిన వేళ.. రేడియో జాకీని లైంగికంగా వేధించిన ఉదంతంలో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ అరెస్ట్ కావటం సంచలనంగా మారింది.
ఈ రోజు ఉదయం నెల్లూరు నుంచి సిటీకి వచ్చిన ఆయన్ను పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణ నేపథ్యంలో కాసేపు మీడియాతో మాట్లాడారు. తాను యాక్సిడెంట్ గాయాలతో బాధపడుతున్న తనకు సదరు అమ్మాయే ఇష్టపూర్తిగా మసాజ్ చేసిందన్నారు.
ఆమె పట్ల తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని ఒప్పుకోవటం గమనార్హం. గజల్ శ్రీనివాస్ కు చెందిన ఆలయవాటని వెబ్ రేడియోలో జాకీగా పని చేస్తున్న యువతి తనను లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. తన మీద చేసిన ఫిర్యాదుకు ఎలా స్పందించాలో అర్థం కావటం లేదన్న ఆయన.. కొద్ది రోజుల కిందట తనకు యాక్సిడెంట్ అయ్యిందన్నారు.
దీంతో.. శరీరంలో కొన్నిచోట్ల కాల్షియం పేరుకుపోయిందన్నారు. దాన్ని నియంత్రించుకోవటానికి రెగ్యులర్ గా మసాజ్ చేయించుకుంటానని.. ఒక రోజు ఫిజిషియన్ రాకపోవటంతో ఆ అమ్మాయే ముందుకు వచ్చి మసాజ్ చేస్తానని చెప్పిందన్నారు. తాను వద్దన్నా వినకుండా మసాజ్ చేసిందని.. తనకు ఎలాంటి తప్పుడు ఆలోచన లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు పక్కా ఆధారాలతోనే గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. గజల్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసిన యువతి హైదరాబాద్ కు చెందిన మహిళ కాదని చెబుతున్నారు. వేరే ఊరి నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నట్లు చెబుతున్నారు. ఒక హాస్టల్ లో ఉంటూ రేడియోలో పని చేస్తున్నారన్నారు. తాను లైంగికంగా వేధింపులకు గురవుతున్నానని చెప్పటమే కాదు.. ఆడియో.. వీడియో సాక్ష్యాల్ని సమర్పించినట్లు చెబుతున్నారు.