ఏపీ మంత్రి నారాయణకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు కాలేజీలు ఉండటం తెలిసిందే. నిజానికి నారాయణ.. చైతన్య కాలేజీలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఉన్నవి చూసినప్పుడు రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు అసలు ఓ లెక్కలోకే రావన్న మాట వినిపిస్తుంటుంది. హైదరాబాద్ లో గల్లీకొక బ్రాంచ్ ను ఏర్పాటు చేయటమే కాదు.. సదరు బ్రాంచ్ కాలేజీలన్నీ విద్యార్థులతో కిక్కిరిసిపోయి ఉంటాయన్నది అందరికి తెలిసిందే.
ఏం జరిగిందో ఏమో కానీ ఏపీ మంత్రి నారాయణకు చెందిన నారాయణ కాలేజీ బిల్డింగ్ ను కూకట్ పల్లి సర్కిల్ అధికారులు సీజ్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈ బిల్డింగ్‌కు చెల్లించాల్సిన ఆస్తిపన్నును ఇప్పటివరకూ భవన యజమాని చెల్లించలేదని.. దీంతో సీజ్ చేస్తున్న అధికారులు వెల్లడించారు.
కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీకి చెందిన గుండాల రాఘవేంద్రరావుకు సప్తగిరి కాలనీలో బిల్డింగ్ ఉంది. ఇందులో నారాయణ కాలేజీని నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా ఆస్తిపన్నును చెల్లించటం లేదు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బిల్డింగ్ ప్రధాన కార్యాలయంతో పాటు.. అకౌంట్స్ గదిని సీజ్ చేశారు.
విద్యార్థుల పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో.. బిల్డింగ్ మొత్తాన్ని సీజ్ చేస్తే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో సీజ్ చేయలేదని చెబుతున్నారు. అయినా.. బిల్డింగ్ యజమాని ఆస్తిపన్ను చెల్లించలేదనే అనుకుందాం. బిల్డింగ్ లో ఉన్న నారాయణ కాలేజీ సంస్థ కట్టేసి.. ఆ మొత్తాన్ని అద్దెలో కట్ చేసుకుంటే సరిపోయేదిగా. బిల్డింగ్ యజమాని.. నారాయణ కాలేజీ యాజమన్యం మధ్య ఏం జరుగుతుందో ఏమో కానీ.. ఈ సీజ్ వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.