ఆయన నిన్నా మొన్నా నేత కాదు, ఏకంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఇక ఆయన తన శక్తి, సమర్ధత స్తోమతకు మించి కాంగ్రెస్ లో అనేక కీలకమైన పదవులు అందుకున్నారు. ముస్లిం మైనారిటీ నేత కాశ్మీరీ కూడా కాబట్టి ఆయనకు అవకాశాలు మరిన్ని ఎక్కువగానే వచ్చాయి. ఆయనే గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ లో నిన్నటి సీనియర్ మోస్ట్ నేత. ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తనకు ఇన్నేళ్ళ పాటు పోషించిన పార్టీని ఆయన వరసబెట్టి మరీ విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఇక కాంగ్రెస్ కి దేశంలో ముస్లిం ఓటు బ్యాంక్ పెద్ద ఎత్తున ఉంది అని బీజేపీ చేసిన సర్వేలో తేలింది. అందుకే కాంగ్రెస్ నుంచి ఆ ఓటు బ్యాంక్ కి గండి కొట్టాలని భావించి మంచి ముస్లిం లీడర్స్ ని బయటకు తీసుకువచ్చే భారీ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు ప్రతీ రోజూ రాహుల్ గాంధీని వారి చేత విమర్శించేలా కూడా పక్కా ప్లాన్ వేశారు అని అంటున్నారు.
ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కేంద్ర మంత్రిగా మరియూ అనేక రాష్ట్రాలకు ఇంచార్జిగా ఉన్న గులాం నబీ ఆజాద్ అక్కడ పార్టీ నాయకులకు పదవులు ఇప్పించడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు తీసుకునేవారు అని ఆరోపణలు ఉన్నాయి అంటారు. ఆయా డబ్బులతో ఆయన భారీ ఎత్తున బిజినెస్ లు కూడా చేసేవారు అని కూడా చెబుతారు. అలా గులాం నబీ ఆజాద్ బిజినెస్ ల గుట్టు అంతా బీజేపీ పెద్దల వద్ద భద్రమైన సమాచారంగా ఉంది అంటున్నారు.
దాంతో వాటి మీద ఈడీని, సీబీఐని రంగంలోకి దింపితే కధ వేరుగా ఉంటుంది అని అంటున్నారు. ఇక ఈడీ, సీబీఐ మోడీ షా ఏలుబడిలో చాలా యాక్టివ్ గా ఉన్నాయి. దాంతో ఈ రెండు కీలక సంస్థల కన్ను గులాం నబీ ఆజాద్ మీద పడింది అని అంటున్నారు. అందుకే బీజేపీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చేలా ఆజాద్ మీడియా ముందుకు వచ్చి వాజ్ పేయ్ నుంచి ఇతర బీజేపీ పెద్దల ప్రస్థావన తెస్తున్నారు అని అంటున్నారు.
అదే క్రమంలో బీజేపీ వారి మనసెరిగి రాహుల్ గాంధీని తెగ తిడుతున్నారని అంటున్నారు. రాహుల్ కి ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదు అని గులాబ్ నబీ ఆజాద్ వంటి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నేత అంటే అవి జనాలలోకి బాగా వెళ్తాయి. బీజేపీ వారు విమర్శలు చేస్తే పెద్దగా ఎవరికీ పట్టదు, పస అంతకంటే ఉండదు, ఈ మూల సూత్రం తెలిసి బీజేపీ ఆయన్ని లాగిందా లేక గులాం నబీ ఆజాద్ తానుగానే ముందు చూపుతో ఇలా చేస్తున్నారా అంటే రెండూ వాస్తవమే అంటున్నారు.
మొత్తానికి గులాం నబీ ఆజాద్ ఇపుడు వరసబెట్టి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆయన అక్కడ మాట్లాడుతున్నవి కూడా నమ్మదగినవిగా ఉండేలా చూసుకుంటున్నారు. ఆయన ఇందిరాగాంధీని ఏమీ అనడంలేదు, రాజీవ్ గాంధీ బెస్ట్ అంటున్నారు. ఎటొచ్చి సోనియా గాంధీ పుత్ర ప్రేమను ఎండగడుతున్నారు. ఇక కాంగ్రెస్ కి రాహుల్ ఏ మాత్రం పనికిరారు అని అంటున్నారు. ఆయన ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రానే రాదు అని జోస్యం చెబుతున్నారు.
గులాం నబీ ఆజాద్ ఈ రకంగా రాజకీయ జోస్యం చెప్పడం కాంగ్రెస్ కి ఎలా ఉన్నా బీజేపీ వారికి మాత్రం పరమాన్నం వండుకు తినినట్లుగా ఉంది అంటున్నారు. ఈ దెబ్బకు ఆజాద్ బీజేపీకి పార్టీలో లేకుండానే మంచి మనిషి అయిపోయారు అంటున్నారు. ఇక ఆయన మీద ఏ ఈడీ తొంగి చూడదు, ఏ సీబీఐ కన్ను వేయదు అని కూడా అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ ని చీల్చాలని, కలి పుట్టించాలని కమలనాధులు పన్నిన పన్నాగానికి ఆజాద్ తన వంతుగా సహకరిస్తున్నారు. మరి ఇంకెంతమంది ఆజాద్ లను కాంగ్రెస్ నుంచి బయటకు తెస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.