తన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టే వాళ్లనూ, తమ సొమ్ములు ఖర్చు పెట్టి నలుగురికీ ఉపయోగపడే పనులు చేసే వాళ్లనూ చాలా మందిని చూసి ఉంటారు. రాజకీయ నేతల పుట్టిన రోజులను వారి అనుచరులు గ్రాండ్ గా జరుపుతూ ఉంటారు. తమ నాయకుడి పుట్టిన రోజును సొంతం ఖర్చులతో ప్రజలకు ఉపయోగపడే విధంగా జరుపుతారు వాళ్లు. అయితే ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాత్రం తన పుట్టిన రోజును వేరే రకంగా జరుపుకున్నారట.
శుక్రవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనే భారీగా కానుకలు స్వీకరించారట. ఆ కానుకలు జనాలు ఇష్టంతో ఇచ్చినవి కావు. బలవంతపు వసూళ్లు అని తెలుస్తోంది. ప్రతి డిపార్ట్ మెంట్ నుంచి భారీ మొత్తాలు అన్నా రాంబాబుకు కానుకలుగా వెళ్లాయట. వాటిని ఇప్పించుకున్నారట.
అలాగే గ్రామలంటీలర్ల పోస్టుల అమ్మకాల మొత్తాలు కూడా పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యేకు అందాయట. ఇలా ఆయనకు చేరిన మొత్తం దాదాపు కోటి రూపాయలు అని గిద్దలూరులో ఒకటే చర్చగా మారింది! పుట్టిన రోజున పదిమంది కి పెట్టేదేమీ లేదు కానీ, బలవంతపు వసూళ్లను అయితే గట్టిగా రాబట్టుకున్నాడట అన్నా రాంబాబు. ఈ అంశంపై గిద్దలూరు ప్రజలు చర్చించుకుంటున్నారు.
అదొక విషయం అయితే, మరో విషయం వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ఇటీవల గిద్దలూరు నియోజకవర్గంలో అస్సలు నిర్వహించలేదు! వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించాలని పార్టీ తరఫున అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినా అన్నా రాంబాబు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నియోజకవర్గంలో ఎక్కడా వైఎస్ జయంత్యోత్సవాలు జరగలేదు. అయితే అన్నా రాంబాబు పుట్టిన రోజు వేడుకులను మాత్రం అలా అక్రమ వసూళ్లతో జరుపుకున్నారు.
ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అవినీతి చర్యల విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. వాటి జోలికి వెళ్లవద్దని చెబుతూ ఉన్నారు. అయినా అన్నా రాంబాబు లాంటి వాళ్లు మాత్రం తీరు మార్చుకోవడం లేదని గిద్దలూరు ప్రజలు అనుకుంటున్నారు!