మ‌నిషి అనేటోడు సిగ్గుప‌డేలా బీహార్ ఆరాచ‌కం

Update: 2018-05-01 06:10 GMT
మ‌నిషిలో మాన‌వ‌త్వం అంత‌కంత‌కూ తగ్గిపోతోంది. ఆరాచ‌కం పెరిగిపోతోంది. నోటితో చెప్ప‌లేని తీరులో వ్య‌వ‌హ‌రిస్తున్న వైనాలు ఇప్పుడు త‌ర‌చూ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. బిహార్ లో చోటు చేసుకున్న ఉదంతం కూడా ఇదే కోవ‌కు చెందిందే. న‌డి రోడ్డు మీద అంద‌రూ చూస్తున్న వేళ‌.. ఒక బాలిక‌ను అడ్డ‌గించి.. ఆమె దుస్తుల్ని విప్ప‌దీసే ప్ర‌య‌త్నం చేసిన యువ‌కుల తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. కార‌ణం ఏమిట‌న్న‌ది పూర్తిగా బ‌య‌ట‌కు రాలేదు కానీ.. బిహార్ లోని జెహానాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న తాలుకూ వీడియో వైర‌ల్ గా మారింది. ఇందులో అంద‌రూ చూస్తుండ‌గానే ఒక బాలిక‌పై కొంద‌రు యువ‌కులు ఆడ్డుకున్నారు. రోడ్డు మీద వెళుతున్న ఆమెను అడ్డుకోవ‌ట‌మే కాదు.. ఆమె దుస్తులు విప్పే ప్ర‌య‌త్నం చేశారు. వారి ప్ర‌య‌త్నాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన బాలిక‌పై దాడి చేసిన వారు.. ఆమె బ‌ట్ట‌ల్ని బ‌ల‌వంతంగా చించేశారు.

ఆమె కాలును ప‌ట్టుకొని న‌డిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. త‌న‌ను వ‌దిలేయాల‌ని ఎంత బ్ర‌తిమిలాడినా వారు వినిపించుకోలేదు. అంత‌కు మించిన పైశాచికానికి దిగారు. ఈ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో వైర‌ల్ గా మారి సంచ‌ల‌నమైంది. దీనిపై త‌క్ష‌ణ‌మే స్పందించిన పోలీసులు నిందితుల‌పై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ప‌ట్నా జోన‌ల్ ఇన్ స్పెక‌ర్ట్ జ‌న‌ర‌ల్ హుస్సైన్ నిందితుల్ని ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు వాడిన వాహ‌నం నెంబ‌రు ఆధారంగా ఇప్ప‌టివ‌ర‌కూ న‌లుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News