వాంతి వచ్చి.. బస్సులో తల బయట పెడితే..

Update: 2016-06-16 05:00 GMT
ప్రమాదం ఎలా పొంచి ఉందన్న విషయం అర్థం కానిది. అయితే.. వీలైనంతవరకూ జాగ్రత్తగా ఉండాలని.. ప్రమాదానికి అవకాశం ఉందన్నవిషయాన్ని గుర్తించాలన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. బస్సులో ప్రయాణిస్తున్న ఒక బాలిక వాంతి వస్తుందని బస్సులో నుంచి తల బయటకు పెట్టటం ఆమె తీవ్ర ప్రమాదానికి గురైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర సంచలనంగా సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరానికి చెందిన 12 ఏల్ల సజ్జా సౌందర్య వాళ్ల అమ్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఊరికి తిరిగి వెళ్లేందుకు సత్తుపల్లి బస్సు ఎక్కారు. బస్సు వెంకటాద్రిపురం చేరుకునే సరికి సౌందర్యకు కడుపులో గడబిడగా ఉండటం.. వికారంతో వాంతు వచ్చిన పరిస్థితి. దీంతో.. వాంతి చేసుకునేందుకు వీలుగా తన తలను బస్సు కిటీకి లోపల నుంచి బయటకు పెట్టింది. అనూహ్యంగా ఆమె తల బయట పెట్టిన వేళ.. వేగంగా వచ్చిన లారీ కారణంగా ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే బస్సును నిలిపివేసిన బస్సు డ్రైవర్.. 108లో సౌందర్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఇంత జరిగిన తర్వాత కూడా ఆపకుండా వెళ్లిపోతున్న లారీని స్థానికులు వెంబడించారు. నూజివీడు మండలం అన్నవరం వద్ద లారీని ఆపి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నందిగామకు చెందిన ఈ లారీ మహారాష్ట్ర నుంచి ముదినేపల్లికి లోడుతో వెళుతున్నట్ల గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం మీద విచారణ చేస్తున్నారు. ఈ ఘటనను చూసినప్పుడు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని.. ఏ చిన్న నిర్లక్ష్యమైనా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పొచ్చు.
Tags:    

Similar News