అభిమానుల అభిమానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? తమ ఫేవరెట్ హీరోతో నిండా లవ్ లో పడిపోవడం ఫ్యాన్స్ కి అలవాటు. ఏమాత్రం ఛాయిస్ దొరికినా ప్రపోజ్ చేసేందుకు వెనకాడరు. సరిగ్గా అలాంటి సన్నివేశమే ఆ కుర్ర హీరోకి ఎదురైంది.
బాలీవుడ్ యంగ్ రైజింగ్ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి పరిచయం అవసరం లేదు. 2011లో ప్యార్ కా పంచనామా అనే చిత్రంతో తెరకు పరిచయం అయిన ఈ గ్వాలియర్ చాక్లెట్ బోయ్ బాలీవుడ్ లో ఎలాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇంతింతై అన్న చందంగా ఎదిగేస్తున్నాడు. ప్యార్ కా పంచనామా 1 - 2 చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత ఆకాశవాణి- కాంచి- సోనూ కే టిటు కీ స్వీటీ (2018) - లూకా చుప్పీ (2019) వంటి చిత్రాల్లో నటించాడు. ఇందులో రెండు మూడు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అతడికి యువతరంలో అసాధారణ క్రేజు ఉంది.
తనకు ఎంత క్రేజు ఉంది? అనేందుకు ఇదిగో ఈ దృశ్యం చూస్తే అర్థమవుతోంది. తనని కలిసేందుకు ఓ వీరాభిమాని నేరుగా తన ఇంటికే వచ్చేసింది. తనని కలవాల్సిందేనంటూ మారాం చేసింది. అంతేనా కార్తీక్ ఆర్యన్ వారించబోతుంటే ఏకంగా మోకాళ్లపై కూచుని ప్రపోజ్ చేసేసింది. సదరు హీరోగారు ఒక్క హగ్గివ్వగానే ఫ్రీజ్ అయిపోయింది. తనతో పాటు ఓ సెల్ఫీ దిగి హీరో అక్కడి నుంచి జంపయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. అన్నట్టు మన డార్లింగ్ ప్రభాస్ కి ఇప్పుడు ఉత్తరాదిన ఆ రేంజు వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దేవరకొండ కూడా ఆ దారిలో తనకు ఉత్తరాదినా క్రేజు తెచ్చుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు మరి.