పక్కింటి అంకుల్ తో శృంగారం వద్దనడంతో విద్యార్థిని ఆత్మహత్య

Update: 2020-07-16 23:30 GMT
తెలియనితనం.. మాయమాటలకు ఆకర్షితులై అమ్మాయిల మానప్రాణాలు పోతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ విద్యార్థిని పక్కింటి అంకుల్ తో తరచూ శృంగారంలో పాల్గొనేది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.

కళాశాలలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి పక్కన వివాహితుడైన యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది వద్దని.. తప్పు అని చెప్పి మందలించడంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. వైరస్ కారణంగా సెలవులు రావడంతో ఇంటి వద్దనే ఆ విద్యార్థిని ఉంటోంది. ఆ సమయంలో ఇంటి పక్కన ఓ వివాహితుడు పరిచయమయ్యాడు. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్తా వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు.

ఇది గమనించిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసి తమ కుమార్తెను మందలించారు. దీంతో ఆ విద్యార్థి అక్కడ నుంచి వివాహితుడికి ఫోన్‌ చేసి తనను తీసుకువెళ్లాలని, లేకుంటే చనిపోతానని బెదిరించింది. దీంతో ఆ వ్యక్తి ఆ విద్యార్థిని గ్రామానికి వెళ్లాడు. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

అయినా ఆ యువతి వినలేదు. తనను పెళ్లి చేసుకోవాలంటూ పట్టుబట్టింది. దీంతో ఇరు కుటుంబాలకు విషయం తెలియడంతో గొడవలు జరిగాయి. పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను స్టేషనుకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించి వేశారు. దీంతో యువతిని బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు ఇంట్లోనే కట్టడి చేశారు. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Tags:    

Similar News