ఇండియా కి గ్లోబల్ హీట్ ముప్పు .. !

Update: 2019-12-06 07:03 GMT
ప్రపంచం లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశానికి ఒక చేదు వార్తా. ప్రస్తుతం ఎంతసేపు కూడా మన పని జరిగిందా ..లేదా అని మాత్రమే చూస్తన్నారే తప్ప .. మిగతా పరిస్థితులని ఎవరు కూడా పట్టించుకోలేదు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశం లో ..రోజు రోజుకి వాహనాలు కూడా పెరిగి పోతున్నాయి. దీని తో వాయు కాలుష్యం కూడా ఎక్కువైపోతోంది. ప్రస్తుతం ఈ కాలుష్యం ప్రపంచంలోని చాలా దేశాలని వణికిస్తోంది. ఈ కాలుష్యం ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఇండియా కూడా ఈ గ్లోబల్ హిట్ ముప్పులో ఉందని తెలిపింది.

జర్మన్ వాచ్ అనే సంస్థ.. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2020 .. పేరిట విడుదల చేసిన నివేదిక లో భారత్ ఐదో స్థానం లో నిలిచింది. ఈ గ్లోబల్ హిట్ కారణంగా ఇప్పటికే భారతదేశం లో అనేక ఘోరాలు జరిగాయి. ఈ జర్మన్ వాచ్ సంస్థ 181 దేశాల్లోని వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసింది. గ్లోబల్ హీట్ పెరుగుతున్న కారణంగా అనేక దేశాల్లో మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఈ రిపోర్టు వెల్లడించింది. గత ఏడాది ఇండియా లో ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేకమంది మృత్యువాత పడ్డారు.. అలాగే భారీగా ఆస్తినష్టం సంభవించింది అని తెలిపింది.

గత ఏడాది కేరళలో కొండచరియలు విరిగి పడి సుమారు 324 మంది ప్రాణాలు కోల్పోయారు.. అనేకమంది సజీవ సమాధి అయ్యారు అని ఈ నివేదిక తెలిపింది. రెండు లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని, 80 డ్యామ్ లు దెబ్బ తిన్నాయని,2. 3 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఈ సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. తిత్లీ, గజ వంటి తుపానులు గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో పెను నష్టాలను కలిగించినట్టు తెలిపింది. ఈ గ్లోబల్ హీట్ ప్రమాదపు అంచుల్లో జపాన్, జర్మనీ, ఫిలిపీన్స్ మడగాస్కర్ తరువాత భారత్ ఐదో స్థానంలో నిలిచింది.


Tags:    

Similar News