‘కాఫీ విత్ సీఎం’.. ముఖ్యమంత్రి కొత్త ప్రోగ్రాం

Update: 2020-11-03 11:10 GMT
‘భరత్ అనే నేను’ సినిమాలో హీరో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకే పోయి సమస్యలు తెలుసుకునే సీన్ ఇప్పుడు నిజంగా నిజం కాబోతోంది. ఒక ముఖ్యమంత్రి ‘కాఫీ విత్ సీఎం’ అంటూ నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. గోవాలో.. అవును గోవా ముఖ్యమంత్రి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

బాలీవుడ్ లో దర్శక నిర్మాత కరణ్ జోహర్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ ఎంతో పాపులర్. సినీ సెలెబ్రెటీలను పిలిచి వారి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను కరణ్ బయట పెడుతుంటారు. ఆ ప్రోగ్రాం స్ఫూర్తితో అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఏకంగా ఇలాంటిదాన్ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఒక్కో తాలూకాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడి వారితో పలు విషయాలపై చర్చిస్తున్నారు.

కాఫీ విత్ సీఎం కార్యక్రమంలో భాగంగా యువకులు, రైతులు అందరినీ ప్రమోద్ కలువబోతున్నారు. వారి ఇబ్బందులను తెలుసుకోనున్నారు. త్వరలోనే తాను ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటానని సీఎం స్పష్టం చేశారు.
Tags:    

Similar News