డిగ్గీ చేత‌కాని త‌నంతో ప‌రువు పోయింద‌ట‌

Update: 2017-03-15 08:04 GMT
ఎన్నిక‌ల్లో ఓటర్లు ఆదరించినా...గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఫలమైందంటూ కొత్తగా గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, గోవా ఇన్‌ చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన సంద‌ర్భంగా ఇది జ‌రిగింది. ప్రజలు మద్దతు తెలిపి అత్యధికంగా 17 చోట్ల పార్టీని గెలిపించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మిగతా నలుగురు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంలో వెనుకబడ్డారని కొత్త ఎమ్మెల్యేలు బహిరంగంగానే దిగ్విజ‌య్ సింగ్ తీరుపై ఆయ‌న ముందే అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్ర‌క‌టించారు.
 
"గోవాలో సీఎం పీఠం కైవ‌సం చేసుకునే విష‌యంలో...సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమైంది. ఓటర్లు మద్దతిచ్చినా సీనియర్ నాయకుల అవివేకం వల్ల పార్టీ అవకాశాన్ని చేజార్చుకుంది. బీజేపీకి మద్దతివ్వాలంటూ నాపై చాలా ఒత్తిడిలు వస్తున్నాయి. కానీ మా నేత సోనియాగాంధీ కోసం వెనక్కి తగ్గుతున్నాను" అని అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ పీ రాణే ఎన్డీటీవీతో చెప్పారు. మరో ఎమ్మెల్యే జెన్నిఫర్ మాన్సరేట్ మాట్లాడుతూ.. ఓటర్లు మద్దతిచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామన్నారు.

ఎమ్మెల్యేల ఆగ్ర‌హం నేప‌థ్యంలో దిగ్విజయ్‌ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ ను కలిసేందుకు గత ఆదివారమే అపాయింట్‌ మెంట్ ఇవ్వాలని లేఖ ఇచ్చినా, సమయం ఇవ్వలేదని చెప్పారు. నిబంధనలు ప్రకారం అతిపెద్ద పార్టీని ఆహ్వానించకుండా, రెండో స్థానంలో ఉన్న బీజేపీకి గవర్నర్‌ అవకాశం ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం తమకు ఉందని, సభలో తమ మెజార్టీని నిరూపించుకుంటామని గవర్నర్‌ కు తెలిపినట్లు కాంగ్రెస్ ప‌క్ష నేత చంద్రకాంత్‌ కవ్లెకర్‌ విలేకరులకు తెలిపారు. ప్రజల తిరస్కరణకు గురైన బీజేపీకి మొదటి అవకాశం ఇచ్చి నిబంధనలను గవర్నర్‌ అపహాస్యం చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. ప్రజా తీర్పును బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని, అవకాశవాద రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News