అమిత్ షాకు భారీ షాకిచ్చిన త‌మిళులు

Update: 2018-07-11 04:11 GMT
బీజేపీ ప‌ప్పులు ఎక్క‌డైనా ఉడుకుతాయో కానీ మా ద‌గ్గ‌ర మాత్రం కాదంటూ త‌మిళులు మ‌రోసారి తేల్చి చెప్పిన వైన‌మిది. బీజేపీకి ఏ మాత్రం కొరుకుడుప‌డ‌ని త‌మిళ‌నాడులో.. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు దిమ్మ తిరిగే షాకింగ్ అనుభ‌వం ఒక‌టి ఎదురైంది.

తాజాగా అమిత్ షా ఒక‌రోజు త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌ను చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా షా ప‌ర్య‌ట‌న‌పై అనూహ్య‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఆయ‌న రాక‌పై త‌మిళ‌నాడు బీజేపీ వ‌ర్గాలు హ్యాపీగా ఫీల్‌ కాగా.. నెటిజ‌న్ల పుణ్య‌మా అని అది కాస్తా ఆవిరైంది. అమిత్ షా త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌పై త‌మిళులు సోష‌ల్ మీడియాలో తీవ్రంగా వ్య‌తిరేకించారు.

త‌మిళ యువ‌త నుంచి వెల్లువెత్తిన నిర‌స‌న ఏ స్థాయిలో ఉందంటే.. ట్విట్ట‌ర్ ట్రెండింగ్స్ లో రెండో స్థానంలో నిలిచింది.గో బ్యాక్ అమిత్ షా అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు.. రీట్వీట్లు.. కామెంట్ల‌తో త‌మ‌కున్న వ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట‌పెట్టారు.

అమిత్ షా గో బ్యాక్ హ్యాష్ ట్యాగ్ విప‌రీతంగా ట్రెండ్ అయ్యింది. ఏకంగా దీనికి 1.29ల‌క్ష‌ల మంది మ‌ద్ద‌తు ప‌లికారు. దీంతో ట్విట్ట‌ర్ ఇండియా ట్రెండ్స్ లో అమిత్ షా గోబ్యాక్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. త‌మిళ‌నాడు  ఇండియా కాదు అమిత్ షా.. స‌మాన‌త్వానికి త‌మిళ‌నాడు గ‌డ్డ వేదిక‌.. నీలాంటి టెర్ర‌రిస్టును త‌మిళ‌నాడు రానివ్వ‌దు.. ట్యూటికోరిన్ కాల్పుల‌పై షా స్పందించారా? ఒక జాతీయ పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న‌కు నైతిక బాధ్య‌త లేదా?   లాంటి వ్యాఖ్య‌ల‌తో అమిత్ షాను తీవ్రంగా తిట్టిపోశారు. సామాజిక మాధ్య‌మాల్లో త‌మ అధ్య‌క్షుల వారిపై పెల్లుబికిన వ్య‌తిరేక‌త‌తో త‌మిళ బీజేపీ నేత‌లు కంగుతిన్నారు. నెటిజ‌న్ల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేక‌త వ్య‌క్తం కావ‌టం క‌మ‌ల‌నాథుల‌కు మింగుడు ప‌డ‌నిదిగా మారింది.
Tags:    

Similar News