షాక్‌: గోదావ‌రిలో బోటు ఊడి వ‌చ్చిందిగా..

Update: 2019-10-21 11:54 GMT
గోదావ‌రిలో తూర్పుగోదావ‌రి జిల్లా దేవీప‌ట్నం మండ‌లం క‌చ్చులూరు వ‌ద్ద గోదావ‌రిలో నెల రోజుల క్రితం బోటు మునిగిపోయిన సంగ‌తి తెలిసిందే. నెల రోజుల నుంచి బోటును బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయి. చివ‌ర‌కు కాకినాడ‌కు చెందిన ధ‌ర్మాడి స‌త్యం బృందం కొద్ది రోజులుగా బోటును బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక వ‌ర‌ద త‌గ్గ‌డంతో డీప్ డ్రైవర్స్ వెళ్లి రోప్‌ లకు లంగరు తగిలించి వచ్చారు. ఆ రోప్‌ ల సాయంతో బోటును బయటకు లాగే ప్రయత్నం చేశారు.

ఈ ప్ర‌య‌త్నంలో నిన్న బోటు రెయిలింగ్ ముక్క విరిగిరాగా... ఈ రోజు పై భాగం మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌డ‌వ 60 అడుగుల లోతులో ఇసుక‌లో కూరుకుపోయి ఉండ‌డంతో బోటు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మ‌రోవైపు స‌త్యం బృందం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా బోటు పై భాగం మాత్ర‌మే తెగి వ‌చ్చింది. ఇక బోటు నెల రోజులుగా నీళ్ల‌లోనే నానుతూ ఉండ‌డంతో బోటు పార్టులు పార్టులు కింద ఊడిపోతోంద‌ని తెలుస్తోంది.

ఇక లంగ‌రు బోటు పై భాగంలో వేయ‌డంతో కూడా బోటు స‌గం వ‌ర‌కు ఊడిపోయి వ‌చ్చి ఉండ‌వ‌చ్చంటున్నారు. ఏదేమైనా మ‌రోసారి డీప్ డ్రైవ‌ర్లు బోటు ఇంజ‌న్ భాగంలో లంగ‌రు వేస్తే ఈ సారి బోటు మొత్తం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక బోటు లోతులో... అది కూడా ఇసుక‌లో కూరుకుపోవ‌డంతోనే బ‌య‌ట‌కు రావ‌డం లేదంటున్నారు.

ఇసుక‌లో కూరుకుపోవ‌డంతో లంగ‌రు వేసి పై నుంచి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆ ఒత్తిడికి స‌గం ముక్క మాత్ర‌మే వ‌చ్చింది. ప్రస్తుతం సగభాగం ఊడిపోయి వచ్చిన నేపథ్యంలో సత్యం బృందం మరోసారి డ్రైవర్స్‌ ను పంపి ఈసారి పూర్తిగా బోటు బయటకు వచ్చేలా లంగరు వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఈ ప్ర‌య‌త్నాల్లో ఈ సారి అయినా బోటు బ‌య‌ట‌కు వ‌స్తుందేమో ?  చూడాలి.
Tags:    

Similar News