తెలుగు రాష్ట్రాల్లో పుష్కర సందడి మొదలు

Update: 2015-07-14 03:30 GMT
పన్నెండళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు మొదలయ్యాయి. దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి పుష్కరాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తొలి పుష్కరాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీసమేతంగా ధర్మపురిలో గోదారమ్మకు నూతన వస్త్రాలు సమర్పించి.. పుష్కర స్నానం ఆచరించారు. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతం ఉన్న ఐదు జిల్లాల్లో పుష్కర సంరంభం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా తొలి రోజు ఉదయానికి పది లక్షల మంది పుష్కర స్నానం ఆచరించినట్లుగా చెబుతున్నారు. గోదావరి పుష్కరాల్ని కుంభ మేళ స్థాయిలో చేయాలని భావించినా.. వర్షాలు పడక.. పలు జిల్లాల్లోని ఘాట్లలో నీరు లేకపోవటంతో చిన్నబోతున్న గోదారమ్మ నుంచి భక్తులు నిరాశ చెందుతున్నారు. తెలంగాణలోని ఐదు జిల్లాల్లోని పుష్కరాల్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. పలువురు మంత్రులు ప్రారంభించారు.

మరోవైపు..ఏపీలో గోదావరి పుష్కరాలు మొదలయ్యాయి. రాజమండ్రిలో మంగళవారం ఉదయం 6.26 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రదబాబు దంపతులు గోదారి మాతకు చీరను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి.. పుష్కర స్నానం ఆచరించారు. మరోపక్క పుష్కర స్నానాన్ని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే పుష్కరాల హడావుడి మొదలైంది. భారీగా ప్రజలు పుష్కర స్నానాలు చేస్తున్నారు. పుష్కర శోభ వెల్లివిరిసేలా పుష్కర ఘాట్ల వద్ద ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Tags:    

Similar News