జ‌గ‌న్‌ పై గోదావ‌రి ప్ర‌భావం.. ఏ రేంజ్‌ లో...!

Update: 2019-07-28 01:30 GMT
ఏపీలో ప్ర‌భుత్వం మారిన నేప‌థ్యంలో పొరుగు రాష్ట్రాల‌తో స‌ఖ్య‌తగా ఉండాల‌నే ఏకైక కాన్సెప్ట్‌ తో ముందుకు వెళ్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తెలంగాణ‌తో వివాద ర‌హితంగా ముందుకు సాగుతున్నారు. నిజానికి గ‌త ప్ర‌భుత్వంలోనూ తెలంగాణ‌తో మిత్ర వైఖ‌రినే కోరుకున్నారు. నిధులు - నీళ్లు - ఉద్యోగులు - ఆస్తుల పంప‌కాల‌కు సంబం ధించి మిత్రుత్వంతోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని నాయ‌కులు భావించారు. అయితే, ఇది రాజ‌కీయంగా ఇబ్బంది లేనంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఎప్పుడైతే తెలంగాణ‌లో టీడీపీ ఎద‌గాల‌ని - టీఆర్ ఎస్‌ కు చెక్ పెట్టాల‌ని వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసిందో అప్పుడు ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది.

దీంతో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా రాత్రికి రాత్రి ఏపీకి త‌ర‌లి వ‌చ్చారు. క‌ట్ చేస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా రాజ‌కీయ వైరం అనేక రూపాల్లో పెచ్చ‌రిల్లింది. ఇది వివిధ స‌మ‌స్య‌ల‌ను మ‌రింత జ‌ఠిలం చేసేసింది. ఇక‌, ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది. వైసీపీ నేతృత్వంలో జ‌గ‌న్‌.. తెలంగాణ‌తో మిత్ర వైఖ‌రినే స్వాగ‌తిస్తున్నారు. ఎక్క‌డా కూడా బెస‌గ‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వంతో చెలిమి చేయ‌డం ద్వారా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల మేర‌కు గోదావ‌రి న‌దిపై ద‌మ్ముగూడెం వద్ద ప్రాజెక్టును నిర్మించి - ఆ నీటిని శ్రీశైలం - సాగ‌ర్‌ ల‌కు మ‌ళ్లించాల‌ని ప‌క్కా వ్యూహం వేసుకున్నారు.

ఈ క్ర‌మంలో స‌ద‌రు ప్రాజెక్టుకు అయ్యే మొత్తంలో ఏపీ కూడా వాటా భ‌రించాలి. అయితే, ఇదే ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్‌ ను రాజ‌కీయంగా ఇబ్బంది పెడుతున్న ప్ర‌ధాన అంశంగా మారింది. తెలంగాణ భూభాగంలో నిర్మించే ప్రాజెక్టుకు ఏపీ నిధులు ఇవ్వ‌డం - ప్రాజెక్టులో వాటా కోరుకోవ‌డం ఎందుకు?  రేపు అక్క‌డ ప్ర‌భుత్వం మారితే.. మ‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వు క‌దా! అనేది రాజ‌కీయ నాయ‌కుల వ్యాఖ్య‌లు. అయితే, వాస్త‌వానికి ఏ రెండు రాష్ట్రాల మ‌ధ్య అయినా.. జ‌ల సంబంధ విష‌యాల‌పై చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు ఖ‌చ్చితంగా వాటికి సంబంధించిన నిబంధ‌న‌లు - ఒప్పందాలు చేసుకోకుండా ముందుకు సాగ‌డం అనేది ఉండ‌నే ఉండ‌దు.

అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే ఏపీ ప్రాజెక్టుల విష‌యాన్ని సిట్టింగ్ జ‌డ్జి నేతృత్వంలో క‌మిష‌న్‌ కు అప్ప‌గించి అది ఒప్పుకొంటేనే చేస్తాన‌ని చెబుతున్న జ‌గ‌న్‌.. ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన నీటి విష‌యంలో ఎలా తొంద‌ర‌ప‌డ‌తాడ‌ని అనుకుంటాం. ఆయ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. జ‌ల సంబంధిత విష‌యంలో అన్ని ఒప్పందాలు - ద్వైపాక్షిక దిద్దుబాట్ల‌కు ఆస్కారం లేకుండా ముందుకు సాగుతామ‌ని ఆయ‌నే చెప్పిన‌ప్పుడు ఈ నేత‌ల‌కు ఇంత తొంద‌ర ఎందుకు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రి దీనికి వారు ఏమ‌ని స‌మాధానం చెబుతారో చూడాలి.

   

Tags:    

Similar News