హైదరాబాద్ చెంతకు గోదావరి నీళ్లు

Update: 2020-05-13 06:17 GMT
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతం చోటుచేసుకుంది. గోదావరి పారే కాళేశ్వరం నుంచి కరువు సీమ మెదక్ వరకు అక్కడి నుంచి హైదరాబాద్ చెంతకు ఈ జలాలు తరలివచ్చాయి. కొన్ని వందల కిలోమీటర్లు ఎత్తిపోతలు.. గ్రావిటీ ద్వారా ఎట్టకేలకు మల్లన్న సాగర్ చెంతకు చేరాయి. కొండ పోచమ్మ సాగర్ కు కదిలాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు లోని ప్యాకేజీ 12 లో అత్యంత క్లిష్టమైన పంప్ హౌస్ ల వెట్ రన్ విజయవంతమైంది. దీంతో మెదక్ తోపాటు హైదరాబాద్ నీటి అవసరాలకు ఊపిరిలూదినట్టు అయ్యింది. బుధవారం మల్లన్న సాగర్ తుక్కాపూర్ పంప్ హౌజ్ లో మొదటి భారీ బాహుబలి పంప్ వెట్ రన్ విజయవంతమైంది. మంగళవారం రాత్రి ఈ భారీ బాహుబలి పంప్ ను నడిపించారు. ఇది సక్సెస్ అయ్యిందని మేఘా సంస్థ ఇంజినీర్లు ప్రకటించారు. తుక్కాపూర్ పంప్ హౌజ్ లో మొత్తం 43 మెగావాట్ల 8 బాహుబలి పంపులు బిగించామని తెలిపారు. రోజుకు 0.8 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలవని వెల్లడించారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పవర్ ఫుల్ పంపులు అని మేఘా సంస్థ ప్రతినిధులు తెలిపారు. బుధవారం నుంచి ఒక్కొక్క పంపును వెటరన్ చేస్తామని వారు తెలిపారు.

దీంతో కాళేశ్వరం గోదావరి నీరు హైదరాబాద్ చెంతకు చేరువైంది. కొండపోచమ్మ సాగర్ లోకి గోదావరి జలాన్ని తరలించే క్రతువులో ముందడుగు పడింది. మల్లన్నసాగర్ తుక్కాపూర్ నుంచి ఎత్తిపోస్తున్న జలాన్ని మార్కూక్ పంప్ హౌస్ వద్దకు తరలించి అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్ లోకి ఎత్తిపోస్తారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం మాత్రమే నిర్మించిన ఈ కొండ పోచమ్మసాగర్ వల్ల రాజధాని వాసుల దాహం తీరనుంది. నీటి కొరత సమస్యకు చెక్ పడింది. వచ్చే వానాకాలంలోనే ఈ పనిపూర్తి చేద్దామని అనుకున్నా.. కేసీఆర్ పట్టుదల కోరిక మేరకు మేఘా ఇంజనీరింగ్ అధికారులు వడివడిగా పంప్ హౌజ్ లను సిద్దం చేసి ప్రారంభించారు.

మల్లన్నసాగర్ జలాశయం మానవ నిర్మిత అతిపెద్ద రిజర్వాయర్ గా పేరుగాంచింది. దీనికి సామర్థ్యం 52 టీఎంసీలు.. వ్యవసాయం, తాగు, సాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో ఈ ప్రాజెక్టు ద్వారా 125000 ఎకరాలకు సాగునీరు అందనుంది. తాజాగా మల్లన్నసాగర్ నుంచి 16.18 కి.మీల టన్నెల్ ద్వారా సర్జిపూల్ కు వచ్చి అక్కడి నుంచి కొండ పోచమ్మసాగర్ లోకి నీరు వెళ్లనుంది.
Tags:    

Similar News