రెండు ఊళ్లలో పండుగగా మారిన జగన్ పార్టీ ఎంపీ పెళ్లి

Update: 2019-10-18 11:59 GMT
చిన్న వయసులోనే తొలిసారి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన సంచలనంగా మారిన అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లి సంప్రదాయబద్ధంగా సాగింది. తన చిన్ననాటి స్నేహితుడైన కుసిరెడ్డి శివప్రసాద్ ను పెళ్లాడుతున్న వైనం తెలిసిందే. ఈ రోజు తెల్లవారుజామున ఎంపీ మాధవి నివాసంలో వీరి పెళ్లి ఘనంగా సాగింది. ఈ పెళ్లికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు పెద్ద ఎత్తున  హాజరయ్యారు.

వీరి పెళ్లి నేపథ్యంలో రెండు ఊళ్లలోనూ పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగు విద్యుత్ దీపాల నడుమ పెళ్లి గ్రాండ్ గా జరగటమే కాదు.. పూర్తి సంప్రదాయబద్ధంగా సాగటం విశేషం. మాధవి తండ్రి కమ్ మాజీ ఎమ్మెల్యే దేముడు అభిమానులు కూడా పెళ్లి ఇంట సందడి చేశారు.

ఇక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి బాజాలు మోగేవరకూ పెళ్లికొడుకు.. కుమార్తెను ఒకే చోటకు తీసుకురాకుండా ఉంచుతారు. దీంతీ పెళ్లి ముహుర్తానికి కేవలం గంట ముందుగానే పెళ్లికొడుకును తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3.15 గంటలకు పెళ్లి జరిగినా.. పెద్ద జనసందోహం నడుమ వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కొత్త కపుల్ కు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.
Tags:    

Similar News