నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న ఫ్రాన్స్‌కు వెళ్తున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది.
28న రాత్రి బయలుదేరనున్న సీఎం జగన్.. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారు. అయితే.. దీనికి ముందు.. ఆయన హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించి అనుమతి కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణ జ రిగింది. సీబీఐ తరఫున న్యాయవాదులు.. సీఎం జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని బలంగా వాదించారు.
అయితే. తన పెద్ద కుమార్తె చదువుతున్న యూనివర్సిటీలో జరుగుతున్నతొలి స్నాతకోత్సవ కావడంతో తాను వెళ్లాల్సి వస్తోందని.. దయచేసి అనుమతించాలని.. సీఎం తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్థిం చారు దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు.
ఫ్రాన్స్ కే వెళ్తున్నారా? ఆ వంకతో ఏదైనా వేరే పని మీ ద వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. కేవలం ఫ్రాన్స్‌కే వెళ్లిరావాలని.. విదేశాల్లో ఇతరులను ఎవరికీ కలవరాదని ఆంక్షలు విధించింది.
అదేసమయంలో సీఎం జగన్ వెంట ఆయన సతీమణి మాత్రమే ఉండాలని.. పర్యటనకు కేవలం వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది మాత్రమే పరిమిత సంఖ్యలో ఉండాలని.. బంధువులను తీసుకువెళ్లరాదని సూచించింది.
పర్యటనకు అయ్యే ఖర్చును సొంత నిదుల నుంచి వెచ్చించాలని కూడా సూచించింది. దీనిపై అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే షరతులతో కూడిన పర్యటనకు అనుమతి ఇవ్వడం గమనార్హం.