గోవా వెళుతున్నారా? కొత్త రూల్స్ ను తెలుసుకున్నారా?

Update: 2022-11-03 08:30 GMT
రోటీన్ జీవితంతో అలిసిపోయి.. సాంత్వన కోసం.. సరికొత్త రిఫ్రెష్ మెంట్ కోసం ఆలోచించినంతనే మొదటి ఆప్షన్ గా వచ్చి చేరుతుంది గోవా. దేశ విదేశీయుల్ని విపరీతంగా ఆకట్టుకునే ఈ పర్యాటక ప్రాంతంలో సరికొత్త నిబంధనల్ని తీసుకొచ్చారు. అక్టోబరు 31 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల్ని పర్యాటకులంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త రూల్స్ గురించి అవగాహన లేకపోతే.. ఫైన్ల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే.. కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

గోవాను మరింత సుందరంగా.. పరిశుభ్రంగా.. సురక్షితంగా ఉంచేందుకు వీలుగా ఇప్పుడున్న విధానాల్ని కాసింత మార్చి కొత్త పద్దతుల్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆయా నిబంధనల్ని ఎవరైనా అతిక్రమిస్తే.. వారికి భారీ జరిమానాలు విధించాలని డిసైడ్ చేశారు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా కానీ.. సంస్థ రూపంలో కానీ రూల్స్ ను అతిక్రమిస్తే రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు ఏమంటే..

-  బీచ్ లో డ్రైవింగ్ చేయకూడదు.

-  బహిరంగ ప్రదేశాల్లో వంట చేయటం నిషేధం.

-  బీచ్ లో చెత్త వేయటం.. తాగి బాటిళ్లు పడేయటం.. బాటిళ్లను పగలగొట్టటం  లాంటివి చేయకూడదు.

-  వాటర్ స్పోర్ట్స్ ను గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి.

-  ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగటం.. అల్లర్లను క్రియేట్ చేస్తే చర్యలు తీసుకుంటారు.

-  తోపుడు బళ్లపై వ్యాపారం చేసే వారు పర్యాటకులకు అడ్డు పడితే ఫైన్లు ఖాయం.

-  కొత్త నిబంధనలు ఒక్క టూరిస్టులకు మాత్రమే కాదు.. వారికి సేవలు అందించే వివిధ సంస్థకు సైతం కొత్త రూల్స్ వర్తిస్తాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News