సోదరుల బాటలో గోకరాజు.. వైసీపీలో బాటలోనేనా?

Update: 2019-12-14 12:08 GMT
2014లో బీజేపీ ఎంపీగా గెలిచిన గోకరాజు గంగరాజు ఈసారి ఎన్నికల్లో పోటీచేయలేదు. నాడు టీడీపీ అండతో నర్సాపురం ఎంపీగా గెలిచిన గోకరాజు కొద్దిరోజులుగా రాజకీయాల్లో యాక్టివ్ గా లేకుండా సైలెంట్ గా ఉంటున్నారు.

అయితే ఇటీవల గోకరాజు తమ్ముళ్లు, మొత్తం కుటుంబ సహచరులు, అనుచరులు అంతా వైసీపీలో చేరారు. ఒక్క గంగరాజు మాత్రమే బీజేపీలో ఉండిపోయారు. ఆయన తన కుటుంబంతో కలిసి నడుస్తారని భావించారు. అయితే ఆయన మాత్రం జగన్ సమక్షంలో వైసీపీలో చేరలేదు.

తాజాగా గోకరాజు గంగరాజు ఇంటిపై వైసీపీ జెండా ఎగరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటిపైన చుట్టుపక్కల బీజేపీ జెండాలు, కరపత్రాలు ఇన్నాళ్లు ఉండేవి. అవన్నీ మాయమయ్యాయి. వైసీపీ జెండాలు ప్రత్యక్షమయ్యాయి.

గంగరాజు అధికారికంగా వైసీపీలో చేరకున్నా ఆయన ఇంటిపైన చుట్టుపక్కల బీజేపీ జెండాలు మాయమవ్వడం హాట్ టాపిక్ గా మారాయి. దీంతో త్వరలోనే ఆయన కూడా వైసీపీలో చేరుతారని కొందరంటున్నారు. అయితే కుటుంబం చేరడంతో ఆయన కూడా చేరాడని.. క్రియాశీల రాజకీయాల్లో తెరపైకి ఆయన రావాలనుకోవడం లేదని కొందరు అంటున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం వైసీపీలో ఉండడంతో ఇక గోకరాజుకూడా వైసీపీనే అంటున్నారు.
Tags:    

Similar News