మునుగోడులో డబ్బుల ప్రవాహం: ఇంటికో తులం బంగారం?

Update: 2022-11-02 14:19 GMT
మునుగోడు ప్రజలపై ‘కనకవర్షం’ కురుస్తోంది. ఈ నియోజకవర్గాన్ని పార్టీలు ఎంతకైనా తెగిస్తున్నాయి. నిన్న సాయంత్రం ప్రచారం ముగియడంతో ఇక పంచుడు పని మొదలుపెట్టాయి. దుబ్బాక, హుజూరాబాద్ ను మించి దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మునుగోడు నిలవబోతోంది. సగటున ఒక్కో ఓటుపై అన్ని పార్టీలు కలిసి 40 వేల వరకూ ఖర్చు చేస్తున్నట్టు భోగట్టా. ఇప్పుడు రేపే ఎన్నిక కావడంతో ఇంటికో ‘తులం’ బంగారం పంచుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

రేపే ఓటింగ్ కావడంతో ఈరోజు నియోజకవర్గంలో గుంభనంగా బంగారం పంపిణీ జరుగుతోందట.. ఒక పార్టీ రూ.3వేలు ఇస్తే.. ఇంకో రూ.5వేలు పంచుతోందట.. ఇక కుటుంబం ఉంటే ఇంటికో తులం బంగారం పంపిణీ చేస్తున్నారట..

ప్రచారం ముగిసి ప్రలోభాల పర్వం ముగియడంతో నోట్ల కట్టలు అన్నీ నియోజకవర్గంలో ఏరులై పారుతున్నాయి. కేవలం డబ్బు మాత్రమే కాదు.. బంగారాన్ని కూడా ఓటర్లకు ఎరవేస్తున్నారు. తమ వద్ద ఒక్కో ఇంటికి తులం బంగారం ఇస్తున్నారని.. ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే 10 గ్రాముల బంగారం కాయిన్ ఇస్తున్నారని వారు చెబుతున్నారు.

దీంతో మునుగోడు ఓటర్ల పంట పండుతోంది. వారి ఇంట అటు డబ్బు, ఇటు బంగారంతో కనకవర్షమే కురుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఒక చోట ఇచ్చి.. మరో చోట ఇవ్వకపోవడం వల్ల కూడా నిరసనలు మొదలవుతున్నాయి.

ఎలాగైనా సరే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తులం బంగారాన్ని పంచుతున్నట్టు తెలియడంతో యావత్ దేశం అవాక్కవుతోంది.రెండు ప్రధాన పార్టీలు ఇలా ఎంతకైనా పంచుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఇక పంచకుండా ఒకరిని మరొకరు అడ్డుకునే ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలిసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News