గోనె ప్రకాశరావు గుర్తున్నారా? ఎక్కడో ఈ పేరు విన్నట్టుందా? అయితే.. మీరు కరెక్టే. దివంగత మహా నేత వైఎస్ హయాంలో ఆర్టీసీ ఛైర్మన్ గా.. ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన మీడియాలో తరచూ వచ్చేవారు. ఫక్తు తెలంగావాది అయిన ఆయన.. రాజకీయ విశ్లేషణల విషయంలో ఆయన దగ్గర భారీగా సమాచారం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. కాస్త హడావుడిగా మాట్లాడే గోనె మాటల్లో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. నమ్మకం కుదిరేలా మాట్లాడటంలో ఆయన తర్వాతే ఎవరైనా.
తాజాగా.. ఆయన ఒక మీడియా సంస్థతో ప్రత్యకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. లగడపాటి చేయించిన సర్వేలో కేసీఆర్ కు ఎలాంటి పరిస్థితి ఉందని తేలింది? కేసీఆర్ ముందస్తు నిర్ణయంతో లగడపాటి సర్వేకు ఏమైనా లింకు ఉందా? లాంటి ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. ఇంతకీ.. లగడపాటి సర్వేలో కేసీఆర్ పాలనపై ఏమని రిపోర్టు వచ్చింది? తదితర విషయాల మీద ఆయన మాట్లాడారు. ఆయన చెప్పిన అంశాల్లో ముఖ్యమైనవి.. ఆసక్తికరమైనవి చూస్తే..
+ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నది.. సరికొత్త సంక్షేమ పథకాల అమలుతో ఆయన దేశంలోనే ప్రథమంగా నిలుస్తున్నారు.. తాజా మాజీ శాసనసభ్యుల పై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు వినవస్తున్నాయి.. వారిపై 30 శాతం మించి సానుకూలత కూడా సర్వేల్లో కనిపించడం లేదు.
+ ప్రజలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావిస్తున్నారు.. టీఆర్‌ఎస్ అభ్యర్థుల పై వ్యతిరేకతే కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశంగా మారుతున్నది.. 25 నుంచి 30 మంది అభ్యర్థులను మార్చుకుంటే టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వస్తాయనే అభిప్రాయం కలుగుతున్నది..
+ ఇప్పటి వరకు రాష్ట్ర ముందస్తు ఎన్నికల అంశంపై టీఆర్‌ఎస్ - కాంగ్రెస్ - బీజేపీలు, ఇతర సంస్థలు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ దాదాపుగా ఇదే విషయం తేలింది.. గతంలో కరీంనగర్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ టీఆర్‌ఎస్‌కు అండగా ఉండగా ఇప్పుడు ఈ జిల్లాల్లో పోటాపోటీ పరిస్థితి నెలకొంది.
+ కేసీఆర్ చేయించుకున్న సర్వేల్లో రెండు ఎన్నికలు ఒకేసారి వస్తే జాతీయ సమస్యలు ప్రధానంగా తెరపైకి వచ్చి టీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే పరిస్థితి ఉందని తేలింది. ప్రజలు ఎక్కువగా విశ్వసించే లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలో కూడా లోక్‌సభ ఎన్నికలతో కలిసి వెళ్తే టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు నష్టం వాటిల్లుతుందని తేలింది. ఆ నష్టం జరగకుండా చూసుకోవడానికే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
+ కేసీఆర్‌తో సహా అన్ని పార్టీల సర్వేలు, ఇతరులు నిర్వహించిన సర్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 శాతం వరకు సానుకూలత వ్యక్తమయింది. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్యేలపై మాత్రం ప్రతికూల అభిప్రాయాలు ప్రజల్లో బలంగా వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేలెవరికి కూడా 20 నుంచి 30 శాతం మార్కులు రాలేదని సర్వేలు తెలిపాయి. ప్రస్తుతం తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో వారికి ఎదురవుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం.
+ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశంగా మారుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ గ్రాఫ్ పెరుగుతోంది. కొన్నిచోట్ల మోదీ గ్రాఫ్‌ను మించిపోతోంది. రాహుల్‌కు 40 నుంచి 45 శాతం సానుకూలత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.