జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Update: 2021-09-16 06:40 GMT
ఏపీలో ఎన్నికలు పూర్తయ్యి ఫలితం తేలకుండా మూలనపడిపోయాయి జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు.. హైకోర్టు స్టే ఇవ్వడంతో అవీ అతీగతీ లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తాజాగా హైకోర్టు సమర్థించింది. ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిలిచిపోయిన కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చిన ధర్మాసనం ఎన్నికల ఫలితాలను వెల్లడించాలని ఆదేశించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఏప్రిల్ 1న ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే21న తీర్పు ఇచ్చాడు.

పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీచేసిన కొందరు అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీంతో ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఆదేశించింది.

మే 21న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై తాజాగా హైకోర్టు స్టే విధించింది. గురువారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించవచ్చని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.


Tags:    

Similar News