కాక్ టెయిల్ కొట్టేస్తే.. క‌రోనా ఖ‌త‌మేన‌ట‌!

Update: 2021-05-28 03:30 GMT
క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా వైద్యులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తిస్థాయి క్యూర్ ను క‌నుక్కోలేక‌పోయారు. అయితే.. కొవిడ్ తీవ్ర‌త‌ను త‌గ్గించే మార్గాల‌ను వెతుకుతూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న అవ‌కాశాల‌తో క‌రోనాకు చికిత్స చేస్తూనే ఉన్నారు. అయితే.. దేశంలోనే మొద‌టిసారిగా క‌రోనాపై ‘కాక్ టెయిల్‌’ను ప్రయోగించారు!

యాంటీబాడీస్ కాక్ టెయిల్ ను వినియోగించ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను సాధించిన‌ట్టు గురుగ్రామ్ లోని మేధాంత ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. హ‌ర్యానాకు చెందిన 82 ఏళ్ల కొవిడ్ బాధితుడికి రెండు రోజుల క్రితం ఈ యాంటీ బాడీస్ కాక్ టెయిల్ ను అందించార‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఆయ‌న కోలుకోవ‌డ‌మే కాకుండా.. డిశ్చార్జ్ కూడా అయ్యార‌ట‌!

ఈ చికిత్సలో భాగంగా రెండు ర‌కాల యాంటీ బాడీల‌ను క‌లిపి తొలిద‌శ చికిత్స‌గా అందిస్తార‌ట‌. దీంతో.. వైర‌స్ క‌ణాలు శ‌రీరం మొత్తం వ్యాపించ‌కుండా అడ్డుకుంటాయ‌ట‌. కొవిడ్‌-19తోపాటు ప్ర‌మాద‌క‌ర వేరియంట్ గా ఉన్న ‘‘బి.1.617’’ మీద కూడా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోంద‌ని వైద్యులు చెప్పిన‌ట్టు స‌మాచారం.

ఈ కాక్ టెయిల్ ను తీసుకుంటే ఆసుప‌త్రికి వెళ్లాల్సిన వ‌స‌రం 70 శాతం వ‌ర‌కు రాద‌ని చెబుతున్న‌టు తెలుస్తోంది. ఈ మందుకు భార‌త కేంద్ర ఔష‌ధ ప్ర‌మాణాల నియంత్ర‌ణ సంస్థ ఆమోదం కూడా తెలిపింద‌ని స‌మాచారం. అయితే.. ఈ డోస్ కు రూ.59,750 రూపాయ‌లుగా నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.
Tags:    

Similar News