క‌రోనాపై యుద్ధం.. గూగుల్ - యాపిల్ ఒక్క‌ట‌య్యాయి

Update: 2020-04-12 02:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు ఇటు వైద్యులు, అటు శాస్త్ర‌వేత్త‌లు త‌మ ప్ర‌య‌త్నాలు తాము చేస్తున్నారు. ఈ వైర‌స్‌కు టీకా క‌నుగొనే ప్రయ‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు సాంకేతిక సాయం అందించేందుకు పెద్ద పెద్ద సంస్థ‌లూ త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే దిగ్గ‌జ ఐటీ సంస్థ‌లు గూగుల్, యాపిల్ కూడా చేతులు క‌లిపాయి. ఈ వైరస్‌ కట్టడికి బ్లూటూత్ సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం కనుగొనే ప్ర‌య‌త్నంలో ఈ సంస్థ‌లు క‌లిసి సాగుతుండ‌టం విశేషం. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉమ్మ‌డిగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశాయి. అటు ప్రభుత్వాలకు.. ఇటు ఆరోగ్య సంస్థలకు ఉపయోగపడేలా కరోనా బాధితులు ఎవరిని కలిశారనే సమాచారం అందించే 'కాంటాక్ట్‌ ట్రేసింగ్' టెక్నాలజీని రూపొందిస్తామని గూగుల్, యాపిల్ వెల్లడించాయి. ఇదే జ‌రిగితే క‌రోనాను చాలా వ‌ర‌కు నియంత్రించ‌వచ్చ‌ని భావిస్తున్నారు.

క‌రోనా వ్యాప్తిలో అత్యంత ప్ర‌మాద‌క‌ర ద‌శ కాంటాక్ట్ ట్రేసింగే. ఇండియాలో ఇప్పుడిప్పుడే కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా కరోనా సోకిన కేసులు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ ద‌శ‌ను అధిగ‌మించ‌డంలోనే క‌రోనాను ఏ మేర అదుపు చేస్తామ‌న్న‌ది ఆధార‌ప‌డి ఉంది. క‌రోనా వ్యాప్తిని కట్టడిచేయడంలో 'కాంటాక్ట్‌ ట్రేసింగ్‌' కీలకమని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) - ఆపరేటింగ్ సిస్టమ్-లెవల్ సాంకేతిక అంశాల ఆధారంగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని గూగుల్ - యాపిల్ చెప్పాయి. అది రెండు దశల్లో అమలు చేయాల్సి ఉంటుందని - రెండు కంపెనీలు మే నెలలో.. ప్రజారోగ్య సంస్థల యాప్‌ లను ఉపయోగించి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌ లను సమన్వయపరిచి ఏపీఐలను విడుదల చేస్తామని తెలిపాయి. త్వరలో ఒక సమగ్రమైన బ్లూటూత్‌ ఆధారిత కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ను రూపొందించనున్నామని ఆ సంస్థ‌లు చెబుతున్నాయి. ఈ టెక్నాలజీలో వ్యక్తులతో పాటు అనేక యాప్‌ లు - ప్రభుత్వ సంస్థలు - వైద్య ఆరోగ్య సంస్థలను చేర్చనున్నట్లు పేర్కొన్నాయి.
Tags:    

Similar News