జేఎన్‌ యూపై గూగుల్ విచారం!

Update: 2016-03-26 09:13 GMT
తమ సెర్చ్ ఇంజిన్‌ లో యాంటి నేషనల్ - సెడిషన్ - లెఫ్టిస్ట్‌ అని ఏది టైప్ చేసినా ఢిల్లీలోని జేఎన్‌ యూ యూనివర్శిటీ రావడంపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ స్పందించింది.  దీనిపై గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు ఓ మీడియా సంస్థకు మెయిల్ ద్వారా వివరణ ఇచ్చారు. సెర్చింజిన్‌ లో ఉన్న బగ్ వల్లనే ఇటువంటి రిజల్ట్ వస్తోందని..నెట్‌ వర్క్ సమస్య వల్లే ఈ పెద్ద తప్పు జరిగిందని..జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.

ఏ అడ్రస్ తెలియకపోయినా ఆపద్భాందవుడిలా ఆదుకునే గూగుల్ మ్యాప్‌ లో యాంటి నేషనల్ అని టైప్ చేయగానే జేఎన్‌ యూను చూపడంతో కలకలం రేగింది. దీనిపై జేఎన్‌ యూ తీవ్ర అభ్యంతరం తెలిపింది. విశ్వవిద్యాలయం పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా ఇది ఉందని జేఎన్‌ యూ పాలకవర్గం వాపోయింది. సెర్చింజన్‌ లో ఉన్న బగ్‌ వల్లనే రిజల్ట్ అలా వస్తోందని, దీనిని త్వరలోనే రెక్టిఫై చేస్తామన్నారు.
Tags:    

Similar News