ఇప్పుడు ఏ దేశంలో చూసిన ఈ మహమ్మారి గురించే చర్చ నడుస్తుంది. దీని దెబ్బకి ప్రపంచ దేశాలకి పెద్దన్నగా పిలిచే అమెరికా సైతం వణికిపోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 40.12లక్షలకు పెరిగింది. అందులో 11.4లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువైంది. అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 13.5లక్షలకు పెరగ్గా, మరణాలు 80వేలు దాటాయి. యూరప్ లోని పెద్ద దేశాల్లోనూ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు.
అయినప్పటికీ ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం ఉందని.. , చాలా దేశాల్లో లాక్ డౌన్ ఎత్తివేతకు ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. కానీ ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజ సంస్థలు మాత్రం తమ కార్యాలయాలు పున:ప్రారంభించేందుకు మొగ్గుచూపడంలేదు. కరోనా ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి రాక పోవడంతో దిగ్గజ కంపెనీలైన గూగుల్, ఫేస్ బుక్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. సేఫ్టీ నేపథ్యంలో ఉద్యోగులంతా 2021 జనవరి దాకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలను పాటించడమే బెస్టని ఆ కంపెనీలు అంతర్గత ఆదేశాలు జారీచేశాయి.
అలాగే, ఒకవేళ ఎవరైనా ఉద్యోగులు ఆఫీసులకు వస్తామంటే వద్దు అని మాత్రం చెప్పమని.. అయితే ఉద్యోగులెవరూ ఆ పని చేయకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాయి. గత ఆదేశాల ప్రకారం గుగుల్, ఫేస్ బుక్ కార్యాలయాలు జూన్-జులై నాటికి తెరుచుకోవాల్సి ఉన్నా, తాజా సూచనల మేరకు అది మరింత ఆలస్యం కానుంది. ఉద్యోగులతో వర్చువల్ మీటింగ్‌లో సీఈవో సుందర్ పిచాయ్ ఈ మేరకు ప్రకటన చేసినట్లు గూగుల్ సంస్థ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. అంతకంటే ముందే, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్.. తన ఉద్యోగులను వచ్చే ఏడాది ప్రారంభం దాకా ఇళ్ల నుంచే పని చేయాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. గుగుల్, ఫేస్ బుక్ బాటలో మరికొన్ని టెక్ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ గడువును పొడిగించే అవకాశాలున్నాయి.