గూగుల్ చేతికి ట్విట్ట‌ర్‌..!

Update: 2016-09-24 12:48 GMT
సోష‌ల్ మీడియాలో ట్విట్ట‌ర్ ఆవిర్బావం స‌రికొత్త విప్ల‌వం. ట్విట్ట‌ర్ ఏర్పాటు త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ఎన్నో వ‌చ్చినా ట్విట్ట‌ర్‌కు ఉన్న ఆద‌ర‌ణ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. ప్ర‌పంచంలో చాలా మంది సెల‌బ్రిటీలు మిగిలిన సోష‌ల్ మీడియాల క‌న్నా ట్విట్ట‌ర్‌ నే ఎక్కువ‌గా ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి క్రేజ్ ఉన్న ట్విట్ట‌ర్ ప్ర‌స్తుతం సేల్‌ లో ఉంది. ఇందుకు ఆ సంస్థ‌కు వ‌స్తోన్న న‌ష్టాలే కార‌ణంగా తెలుస్తోంది.

 ట్విట్ట‌ర్‌ ను టేకోవ‌ర్ చేసేందుకు ప్ర‌స్తుతం చాలా టెక్ కంపెనీలు సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ట్విట్టర్‌ అమ్మేస్తారని చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఇక గ‌త కొంత‌కాలంగా ట్విట్ట‌ర్ వినియోగ‌దారుల పెరుగుద‌ల రేటు కూడా త‌గ్గుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ట్విట్ట‌ర్‌ ను ఆశ్ర‌యించే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ త‌గ్గ‌డంతో ఆ సంస్థ యాడ్స్ రేటు సైతం త‌గ్గించుకున్న‌ట్టు తెలుస్తోది. దీంతో గ‌త రెండు మూడేళ్ల‌లో ట్విట్ట‌ర్‌ కు న‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని తెలుస్తోంది.

ఇక లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ట్విట్ట‌ర్‌ ను టేకోవ‌ర్ చేసేందుకు గూగుల్ కూడా లైన్లోకి వ‌చ్చిన‌ట్టు టాక్‌. దీని కోసం త్వరలోనే గూగుల్ నుంచి బిడ్ దాఖలయ్యే అవకాశం ఉందన్న టాక్ బిజినెస్ స‌ర్కిల్స్‌ లో వినిపిస్తోంది. ట్విట్ట‌ర్‌ ను సేల్‌ కు పెట్టార‌ని...గూగుల్ దీనిని టేకోవ‌ర్ చేస్తుంద‌న్న వార్త‌ల‌తో ట్విట్ట‌ర్ షేరు మార్కెట్లో ఒక్క‌సారిగా 19 శాతానికి పైగా పెరిగింది.

 2013 త‌ర్వాత ట్విట్ట‌ర్ షేర్లు ఇంత స్థాయిలో పెర‌గ‌డం ఇదే తొలిసారి. ఈ పెరుగుద‌ల‌తో ప్రస్తుతం కంపెనీ మార్కెట్‌ విలువ 16 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్ర‌స్తుతం కూడా ట్విట్ట‌ర్‌-గూగుల్ కొన్ని అంశాల్లో క‌లిసి ప‌నిచేస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ద్వారా ఏదైనా అంశాన్ని వెతికితే దానికి అనుబంధంగా ట్విట్టర్లో ఉన్న ట్వీట్లు సైతం సెర్చ్ రిజల్ట్‌ లో కనిపించేలా రెండు సంస్థ‌ల మ‌ధ్య ఒప్పందం ఉంది.
Tags:    

Similar News