జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ...ఢిల్లీలోని ఈ విశ్వవిద్యాలయం గురించి పరిచయం అక్కర్లేదు. దేశ విద్రోహకర కార్యక్రమాలు - వివాదాలతో మార్మోగిపోతోంది. ఏకంగా ఢిల్లీ జేఎన్ యూ అంటేనే జాతి విద్రోహకర శక్తుల వేదిక అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై వివిధ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్న క్రమంలో విఖ్యాత సెర్చింజన్ గూగుల్ ఇపుడు జేఎన్ యూ అంటే జాతి వ్యతిరేకం అంటోంది.
గూగుల్ మ్యాప్ లో యాంటి నేషనల్ - సెడిషన్ - లెఫ్టిస్ట్(ANTI NATIONAL - SEDITION OR LEFTIST) అని ఏది టైప్ చేసినా ఢిల్లీ జేఎన్ యూను సూచిస్తుంది. ఇలా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ విధంగా సెర్చ్ రిజల్ట్ వస్తోంది. ఈ పరిణామం ఇపుడు రాజకీయవర్గాల్లో - జేఎన్ యూ విద్యార్థుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జేఎన్ యూలోని కొంత మంది విద్యార్థులను జాతి వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వామపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే గూగుల్ మ్యాప్ లో ఇలాంటి పరిణామం సంభవించడం చర్చకు దారి తీస్తుంది.