గుడ్ న్యూస్ చెప్పిన సుందర్ పిచాయ్.. భారత్ లో 8లక్షల కోట్లు పెట్టుబడి!
ప్రెసిడెంట్ జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు మోడీ జూన్ 21 నుంచి జూన్ 24 వరకు యుఎస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా... సుందర్ పిచాయ్ తో పాటు మైక్రోసాఫ్ట్ సీ ఈవో సత్య నాదెళ్ల, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మాన్, ఏఎమ్‌డీ సీఈవో లిసా సు తదితర అగ్రశ్రేణి సీ ఈవో లతో ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు.
అవును... అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారత్ కు శుభవార్త చెప్పింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తో సమావేశం అనంతరం స్పందించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్... భారత్ లోని గుజరాత్ లో గ్లోబల్ ఫిన్ టెక్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా... భారత దేశం లో డిజిటలైజేషన్ ఫండ్ లో భాగంగా గూగుల్ 10 బిలియన్ డాలర్లు (రూ. 8.19 లక్షల కోట్లు) పెట్టుబడి పెడుతుందని తెలిపారు.
ప్రధాని మోడీ ని కలిసిన అనంతరం పిచాయ్ మాట్లాడుతూ "చరిత్రాత్మక యూఎస్ పర్యటన లో ప్రధాని మోడీ ని కలవడం గౌరవంగా భావిస్తున్నాము. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్ లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని మేము ప్రధాని తో పంచుకున్నాము.. జి.ఐ.ఎఫ్.టి. సిటీ గుజరాత్ లో మా గ్లోబల్ ఫిన్ టెక్ ఆపరేషన్ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాను" అని పిచాయ్ పేర్కొన్నారు.
జి.ఐ.ఎఫ్.టి. (గిఫ్ట్) సిటీ అంటే... గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీ నగర్ లో ఉంది. ఈ సందర్భంగా... ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్ రానున్న భవిష్యత్ కు బ్లూప్రింట్ గా తాను భావిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
ఇదే క్రమం లో... అమెజాన్ సీఈఓ ఆండ్రూ జాస్సీ సైతం భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తాము ఇప్పటికే 11 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాము అని చెప్పిన ఆండ్రూ జాస్సీ... మరో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిపారు.