ఎంత పెద్ద సంస్థ అయినా ఎప్పుడో ఒకప్పుడు క్లాష్ కాకుండా ఉండదు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘గూగుల్’ సర్వీసులు కొన్ని తాజాగా డౌన్ అయిపోయాయి.. ఈ సాయంత్రం 5 గంటల నుంచి గూగుల్ కు చెందిన కొన్ని కీలకమైన సర్వీసులు నిలిచిపోవడంతో ఇండియా అంతా అల్లకల్లోలం అయ్యింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి సేవలు నిలిచిపోయినట్లు భావిస్తున్నారు. అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పలువురు యూజర్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై యూట్యూబ్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా.. సర్వర్‌కు కనెక్ట్ కాలేకపోతున్నామన్న మెసేజ్ వస్తోంది.
గూగుల్ సంస్థ సర్వర్లు ఒక్కసారిగా డౌన్ అయిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కొన్ని సేవలు గంటలపాటు నిలిచిపోయాయి. గూగుల్‌కు చెందిన జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ షీట్స్, డాక్స్, జీమెయిల్ తదితర యాప్‌లు ఓపెన్ కావడం లేదంటూ వినియోగదారులు గగ్గోలు పెట్టారు. గూగుల్ సర్వీసులన్నిటిలోనూ రెడ్ లైట్ కనిపించడంతో సర్వర్లు డౌన్ అయినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
గూగుల్ సర్వీసులు ఆగడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొనట్టు హెల్త్ ట్రాకర్ డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. ఒక్కో దేశంలో అప్పుడప్పుడు ఆయా సంస్థల సర్వర్లు డౌన్ అవడం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు గూగుల్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా డౌన్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.