ఇటీవల యూట్యూబ్ చానల్స్ నిర్వహించుకోవడం చాలా కామన్ అయిపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి సాధారణ వ్యక్తులు కూడా యూట్యూబ్ చానల్స్ పెట్టుకుంటున్నారు. కొంతమంది కేవలం యూట్యూబ్ చానళ్ల ద్వారా వచ్చే ఆదాయం నుంచే బతుకుతున్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్స్.. కోట్లలో వ్యూస్‌తో కొంతమంది చాలా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే అటువంటి వాళ్లకు గూగుల్ సంస్థ చిన్న జులక్ ఇచ్చింది. మన తెలుగు యూట్యూబ్ చానల్స్‌కు అమెరికాలో సైతం వ్యూస్ వస్తుంటాయి. దీంతో వాళ్లకు ఆదాయం కూడా బాగానే వస్తుంది.
అయితే ఇక నుంచి అమెరికా వ్యూస్ ద్వారా వచ్చే ఆదాయానికి గూగుల్ కోత పెట్టింది. వాళ్ల నుంచి పన్ను వసూలు చేయబోతున్నది.యూట్యూబ్‌లో యాడ్స్ వస్తుంటాయి. వీటివల్లే యూట్యూబ్ చానల్ నిర్వాహకులకు డబ్బులు వస్తాయి. వీక్షణలు యాడ్‌ను స్కిప్ చేయకుండా చూడటం వల్ల వాళ్లకు ఆదాయం వస్తుంది. అంతేకాక యూట్యూబ్ చానల్‌కు ఉండే సబ్స్క్రైబర్లు, వ్యూస్, ఎన్ని నిమిషాలు చూశారు అనే విషయాల మీద ఆధారపడి వాళ్లకు యాడ్స్ రూపంలో డబ్బులు వస్తుంటాయి.
యూట్యూబ్ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఆధారంగా చానళ్లకు చెల్లిస్తుంది. ఇంకా.. సూపర్ చాట్లు, సూపర్ స్టికర్ల ద్వారా, చానల్ మెంబర్‌షిప్ ద్వారా కూడా యూట్యూబ్ చానళ్లకు ఆదాయం వస్తుంది.
అయితే ఇందులో అమెరికా ద్వారా కూడా ఆదాయం వస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా గూగుల్ తీసుకొచ్చిన రూల్ ప్రకారం.. అమెరికా ద్వారా గనక ఆదాయం వస్తే.. ఆ ఆదాయంలో నుంచి 15 శాతం పన్నును అమెరికాకు చెల్లించాలి.
అందుకోసమే.. పన్ను వివరాలను యాడ్‌సెన్స్ అకౌంట్ ద్వారా సమర్పించాలంటూ గూగుల్ సంస్థ యూట్యూబర్లందరికీ మెయిల్స్ పంపిస్తోంది. ఆ వివరాలను మే 31లోగా పంపాల్సి ఉంటుంది.
ఇందుకోసం.. ఇండివిడ్యువల్ యూట్యూబర్లయితే ‘డబ్ల్యూ-8బీఈఎన్' ఫామ్‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. అదే కంపెనీలైతే (వార్తాసంస్థల యూట్యూబ్ చానళ్ల వంటివి) 'డబ్ల్యూ-8బీఈఎన్-ఈ' పత్రాన్ని పూర్తిచేయాలి.ఇక నుంచి అమెరికా ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతం గూగుల్ మినహాయించుకొని మిగతా మొత్తం యూట్యూబర్‌కు ఇస్తుంది. అమెరికా ద్వారా ఓ యూట్యూబర్‌కు రూ. 100 డాలర్లు గనక వస్తే.. అందులో 15 డాలర్లు గూగుల్ మినహాయిస్తుంది.