గూగులమ్మ.. ఆ ‘ప్రధాని’ని అలా చూపించింది

Update: 2016-07-15 05:30 GMT
మనిషి మనిషే.. మిషిన్ మిషనే. మనిషికి ఉన్న విచక్షణ మిషన్ కు ఉండదు. తనకేం చెప్పారో అదే చేయటం తప్పించి.. తాను చేస్తున్న పని తప్పా? రైటా? అన్నది క్రాస్ చెక్ చేసుకోవటం ఉండదు. అడిగే విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఆ విషయాన్ని వదిలేసి.. తనను ప్రోగ్రామ్ చేసిన రీతిలో రియాక్ట్ కావటం మెషిన్లకు మామూలే. తాజాగా అలాంటి ఇష్యూలో గూగులమ్మ యవ్వారం ఇప్పుడు వైరల్ గా మారింది. బ్రిటన్ ప్రధానిగా డేవిడ్ కామరూన్ రాజీనామా చేయటం.. ఆయన స్థానంలో థెరెసా మేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించటం తెలిసిందే.

అంత పెద్ద గ్రేట్ బ్రిటన్ కు ప్రధాని అయినా.. ఆ కార్యక్రమాన్ని చాలా సింఫుల్ గా మీడియాలో హడావుడి లేకుండా పూర్తి చేయటంతో గూగులమ్మ తాజా అప్ డేట్ విషయంలో కాస్త వెనుక పడినట్లుంది. అందుకే.. ప్రధాని థెరెసా పేరును ఒక్క అక్షరం తప్పుగా స్పెల్ చేసినా.. తనకు తోచిన ఫోటోల్ని చూపించేసి షాకిస్తోంది. బ్రిటన్ ప్రధానిగా థెరెసా పేరు పెద్దగా ప్రచారం జరగకపోవటం.. ఆమెకు సంబంధించిన వార్తలు మీడియా సంస్థల్లో ప్రముఖంగా రాకపోవటంతో.. ఆమె పేరును గూగుల్ లో వెతికే వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి.

దాదాపు మూడు దశాబ్దాల అనంతరం బ్రిటన్ ప్రధాని పీఠం మీద ఒక మహిళను కూర్చువేళ.. థెరెసా పేరును ఇంగ్లిష్ లో ‘‘THERESA’’ గా టైప్ చేయాలి. కానీ.. ఆమె పేరును పలువురు ‘‘TERESA’’గా టైప్ చేశారు.అంతే.. గూగులమ్మ ఈ పేరును తనకున్న మేథోతనంతో తనకు పరిచయమైన ఒక పోర్న్ స్టార్ ను తెర మీద వచ్చేలా చేస్తోంది. బ్రిటన్ ప్రధాని పేరును (ఒక్క అక్షరం స్పెల్లింగ్ మిస్టేక్) కొడితే అది కాస్తా పోర్న్ స్టార్ కు చెందిన ఫోటోలు రావటంతో అవాక్కు అయ్యే పరిస్థితి. దీంతో పలువురు బ్రిటీషర్లు.. తమ ప్రధాని గతంలో కొంతకాలం పోర్న్ స్టార్ గా పని చేశారని కూడా అపోహపడ్డారట. మరికొందరు అత్యుత్సాహవంతులు అయితే.. గూగులమ్మ చూపించిన తప్పుడు ఫోటోల్ని బ్రిటన్ ప్రధాని ఈమే అంటూ తప్పుడు పోస్టింగులను సోషల్ మీడియాలో పెట్టేసి తమ పైత్యాన్ని ప్రదర్శించారట. ఈ యవ్వారం రచ్చ కావటం.. చివరకు జరిగిన తప్పు తెలుసుకొని.. తాము చేసిన పోస్టింగ్ ల విషయంలో సిగ్గు పడిపోయారట. చూస్తుంటే.. ఎవరు తప్పు చేసినా.. చేయకున్నా గూగులమ్మ కాస్త ఆదమరపుతో వ్యవహరిస్తే ఎంత రచ్చో కదూ..?
Tags:    

Similar News