బ్యాంకాక్ లో గొటబాయ హోటల్ అరెస్ట్ ?

Update: 2022-08-13 07:30 GMT
శ్రీలంక నుండి కుటుంబంతో సహా విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రస్తుతం బ్యాంకాక్ లో తలదాచుకుంటున్నారు. సింగపూర్ నుండి ఆదేశ ప్రభుత్వ వెళ్ళగొట్టింది. శ్రీలంక నుండి పారిపోయిన గొటబాయ నేరుగా మాల్దీవులకు వెళ్ళారు. మాజీ అద్యక్షుడు మాల్దీవులకు చేరుకున్నారని తెలియగానే జనాలు ఆందోళనలు మొదలుపెట్టారు. దాంతో జనాల గోల తట్టుకోలేక మాల్దీవుల ప్రభుత్వం గొటబాయ దేశాన్ని వదిలేయమని చెప్పింది.
 
అక్కడినుండి మాజీ అధ్యక్షుడు దుబాయ్ వెళ్ళాలని అనుకున్నారు. అయితే దుబాయ్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. దాంతో వేరేదారిలేక థాయిల్యాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు.

అయితే గొటబాయ కుటుంబాన్ని బ్యాంకాక్ లోకి అనుమతించిన ప్రభుత్వం ఆయన్ను హోటల్ వదిలి బయటకు వచ్చేందుకు లేదని స్పష్టంగా చెప్పేసింది. కేవలం మానవతా దృక్పథంతో మాత్రమే తాము గొటబాయ కుటుంబాన్ని తమదేశంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
మాజీ అధ్యక్షుడికి దౌత్యపరమైన వీసా ఉన్న కారణంగా మాత్రమే తాను అనుమతించినట్లు చెప్పారు. అయితే హోటల్ దాటి బయటకు వెళ్ళేందుకు లేదని, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టేందుకు లేదని ఆంక్షలు విధించింది.

అంటే థాయ్ ల్యాండ్ ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రకారం గొటబాయ హోటల్ వదిలి బయటకు వెళ్ళేందుకు లేదంటే హోటల్ అరెస్టనే అనుకోవాలి. మనకు బాగా తెలిసిన హౌస్ అరెస్టు లాంటిదే లాగుంది ఈ హోటల్ అరెస్టు కూడా. మ్యాగ్జిమమ్ 90 రోజులవరకు గొటబాయ కుటుంబంతో థాయ్ ల్యాండ్ లో ఉండచ్చని ప్రభుత్వం చెప్పింది.

మరి 90 రోజుల తర్వాత పరిస్ధితి ఏమిటో మాత్రం క్లారిటిలేదు. ఇదే సమయంలో తొందరలోనే గొటబాయ తన కుటుంబంతో సహా నవంబర్లో శ్రీలంకకు రాబోతున్నట్లు శ్రీలంక మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే గొటబాయ శ్రీలంకను వదిలి ఎందుకు పారిపోయినట్లు ? మళ్ళీ ఎందుకు తిరిగి స్వదేశం చేరుకుంటున్నట్లు ?  దేశంలో గొటబాయను చూస్తే జనాలు రెచ్చిపోకుండా ఊరుకుంటారా ?
Tags:    

Similar News