రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం.. శాశ్వత శత్రుత్వం లాంటి పదాలకు అవకాశమే ఉండదు. అలా ఉన్నోళ్లు రాజకీయాలకు అస్సలు ఫిట్ కారు. ఆ విషయాన్ని ఇప్పటి రాజకీయ నేతలు అర్థం చేసుకున్నంత బాగా ఇంకెవరూ అర్థం చేసుకోరు కూడా. తన పొలిటికల్ కెరీర్ లో బాబు అన్నా.. బాబు నేతృత్వం వహించే తెలుగుదేశం పార్టీ అన్నా మండిపడే గొట్టిపాటి రవి లాంటి వారు సైకిల్ ఎక్కటాన్ని ఊహించగలమా?
వైఎస్ హయాంలో బాబు మీద కస్సుమని లేచే గొట్టిపాటి రవి.. ఇప్పుడదే బాబు పార్టీలోకి రావటం తెలిసిందే. ఒకప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలోకి వచ్చిన రవి లాంటి వారికి ఆ పార్టీలో పరపతిని పెంచుకోవటం.. అధినేతల అభిమానాన్ని పొందటం అంత తేలికైన విషయం కాదు. అందుకేనేమో.. చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ మనసు దోచుకోవాలన్నట్లుగా గొట్టిపాటి రవి తాజావ్యాఖ్యలు ఉన్నాయి.
తాజాగా మీడియాతో మాట్లాడిన గొట్టిపాటి చినబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇచ్చేందుకు వీలుగా లోకేశ్ ను ఎమ్మెల్సీ గా ఎన్నిక చేసే కంటే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికై వస్తే బాగుంటుందన్నారు. లోకేశ్ కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. లోకేశ్ ను గెలిపించుకుంటానని వ్యాఖ్యానించారు. లోకేశ్ ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ఆ జిల్లా అభివృద్ధి పథంలోకి దూసుకెళుతుందన్నారు.
లోకేశ్ కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి.. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకు వస్తానంటూ గొట్టిపాటి రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చినబాబు కోసం త్యాగానికి రెఢీ అంటున్న గొట్టిపాటి రవి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెంతమంది తెలుగు తమ్ముళ్లు త్యాగాల మాటల్ని చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరెన్ని త్యాగపు మాటలు చెప్పినా.. స్టార్ట్ చేసిన గొట్టిపాటికి పడాల్సిన మార్కులు పడతాయనటంలో సందేహం లేదు.