క‌రోనా రిలీఫ్ ప్యాకేజీ.. ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వ ఆర్థిక సాయం!

Update: 2021-03-07 15:30 GMT
క‌రోనా.. ఈ శ‌తాబ్ద‌పు అతిపెద్ద మ‌హ‌మ్మారి అని చెప్పుకోవ‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు. ఈ వైర‌స్ ధాటికి ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మైపోయింది. ఉద్యోగాలు కోల్పోయి కొంద‌రు.. ఆక‌లితో ఎంద‌రో అల్లాడిపోయారు. వ‌ర‌ల్డ్ వైడ్ గా.. ఈ వైర‌స్ ధాటికి ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోతే.. ఆక‌లితో వేలాది మంది చ‌నిపోయారు. కోటీశ్వ‌రులు మిన‌హా.. మిగిలిన ప్ర‌జ‌లంతా ఆర్థికంగా బాగా చితికిపోయారు.

దీంతో.. త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు నేరుగా ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధ‌మైంది అమెరికా ప్ర‌భుత్వం. ప్ర‌పంచంలో కొవిడ్‌-19 కార‌ణంగా అత్యంత దెబ్బ‌తిన్న దేశం యూఎస్ అన్న సంగ‌తి తెలిసిందే. దీంతో.. ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు అధ‌క్షుడు బైడెన్ సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు దేశ ప్ర‌జ‌ల‌కు ప‌లు రూపాల్లో సాయం చేసేందుకు 1.9 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇందుకు సంబంధించిన బిల్లుకు తాజాగా అమెరిక‌న్ సెనేట్ ఆమోదం తెలిపింది. వ‌చ్చే వారం అమెరిక‌న్ కాంగ్రెస్ ఆమోదం ల‌భించిన త‌ర్వాత‌.. అధ్యక్షుడు జో బైడెన్ తుది సంత‌కం చేస్తారు. ఆ త‌ర్వాత నిధులు విడుద‌ల చేస్తారు. ఈ నిధుల ద్వారా అమెరికా పౌరుల‌కు ఆర్థిక సాయం అందించ‌డం, ప‌న్నుల్లో మిన‌హాయింపులు ఇవ్వ‌డం చేస్తారు. అంతేకాకుండా.. క‌రోనాపై పోరాటానికి అవ‌స‌ర‌మైన ప‌నుల కోసం కూడా కొంత మొత్తం వెచ్చిస్తారు.




Tags:    

Similar News