ప్రభుత్వ ఆర్డర్లపై దుమారం.. ఖండించిన ఏపీ సర్కార్

Update: 2021-01-20 10:07 GMT
ఏపీ సీఎం జగన్ పై మరో అపవాదును మోపడానికి ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ఇప్పటికే దేవాలాయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన జగన్ సర్కార్ కు తాజాగా మరో ఆరోపణ మొదలైంది. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. దీనిపై మంత్రి మేకపాటి అసలు నిజాలు బయటపెట్టారు.

తాజా వివాదానికి సీఎం జగన్ సొంత కంపెనీ ‘భారతి సిమెంట్స్’ కేంద్రంగా మారిందనే చర్చ సాగుతోంది. భారతి సిమెంట్స్ కు ప్రభుత్వం తరుఫున భారీగా ఆర్డర్లను ఇచ్చారనే ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. భారతి సిమెంట్స్ లో సీఎం జగన్ భార్య భారతి డైరెక్టర్ గా ఉన్నారు. ఆమెకు అందులో 49శాతం వాటా ఉంది. మిగిలిన 51శాతం వైక్యాట్ అనే ఫ్రెంచ్ కంపెనీ పేరు మీద ఉంది.ఈ క్రమంలోనే ఈ కంపెనీ ప్రభుత్వం తరుఫున ఆర్డర్లు వెళ్లాయని ఓ ఇంగ్లీష్ జాతీయ వెబ్ సైట్ కథనం రాయడం.. దాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం మొదలుపెట్టాయి.

ఈ ఆరోపణలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వివరణ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు, సమాయానికి అనుగుణంగా భారతీ యాజమాన్యం, సిమెంట్ ను సరఫరా చేస్తోందని మేకపాటి స్పష్టం చేశారు.ఈ ఒక్క కంపెనీకే కాదని.. ఇండియా, పెన్నా సిమెంట్స్ కు కూడా ప్రభుత్వ ఆర్డర్లు ఎందుకు ఇచ్చామో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్ నిర్మాణ్ కార్యక్రమాల కోసం సిమెంట్ ను తక్కువ ధరకు కొంటున్నామని.. 225కే కంపెనీలు ఇస్తున్నాయని వివరణ ఇచ్చింది.

350 ఉన్న సిమెంట్ ను అంత తక్కువకు ఇవ్వడానికి ఏం కంపెనీ రాకుంటేనే బల్క్ గా ఆర్డర్లను స్వీకరించి ప్రభుత్వానికి నిధులు తగ్గించామని మేకపాటి క్లారిటీ ఇచ్చారు.




Tags:    

Similar News