చంద్రబాబుకు షాకిచ్చిన గవర్నర్

Update: 2017-03-06 08:14 GMT
ఏపీ నూతన శాసనసభ ప్రారంభోత్సవం రోజునే గవర్నరు నరసింహన్ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. ఏ పనైనా సక్సెస్ అయితే తన క్రెడిట్, ఫెయిల్యూర్ అయితే అధికారుల తప్పుగా చెప్పే సీఎం చంద్రబాబునాయుడికి గవర్నరు గట్టి డోసే ఇచ్చారు.  అసెంబ్లీ నిర్మాణ క్రెడిట్ చంద్రబాబుకు ఇవ్వకుండా అంతా కార్మికుల గొప్పదనమేనని  గవర్నర్ చెప్పారు. దీంతో చంద్రబాబు మొహం చిన్నబోయిందట.
    
శాసనసభ ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. అమరావతిలో అనతి కాలంలోనే అద్భుత రీతిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో జరుగుతున్న తొలి సమావేశాల్లో తాను కూడా భాగం కావడం, తనకు జీవితంలో లభించిన మహద్భాగ్యమని  వ్యాఖ్యానించారు. రికార్డు సమయంలో అత్యంత ఆధునిక సాంకేతికత, పూర్తి ఎల్ఈడీ వెలుగులతో అసెంబ్లీ భవనాన్ని నిర్మించిన ప్రతి కార్మికుడికీ శుభాకాంక్షలు తెలిపారు.
    
అయితే.. గవర్నరు ప్రసంగమంటే ప్రభుత్వ అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆ తరువాతంతా ఆయన ఏపీ ప్రగతి గురించి చెప్పుకొచ్చారు.  రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా చేయడంలో   ప్రభుత్వం ఎంతో ముందడుగు వేసిందని, ఇప్పటికే లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు, నూతన ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయని, మరిన్ని కంపెనీలు రానున్నాయని చెప్పారు. మొత్తానికి  ప్రభుత్వ విజయాలను ఆయన చెప్పినప్పటికీ చంద్రబాబు పేరు ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News