తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ అసెంబ్లీలో ప్రసంగించారు. దేశంలోనే నవ రాష్ట్రం తెలంగాణ అని గవర్నర్ నరసింహన్ తెలిపారు. నూతన రాష్ట్రమైన తెలంగాణ తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రతి పౌరునికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఉభయసభల్లో చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు - మండలాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ర్టం సిద్ధించిన తర్వాత రాష్ర్ట స్థూల దేశీయ అభివృద్ధిలో గణనీయమైన అభివృద్ధి సాధించామని స్పష్టం చేశారు. 2016-17 ముందస్తు అంచనా ప్రకారం జీఎస్డీపీ 13.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దేశం అంచనా వేసినా 11.5 శాతం కంటే ఇది అదనమని తెలిపారు.
దేశంలోనే ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని, దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 12 శాతం ఉందని గవర్నర్ తెలిపారు. 2015-16లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 75,070 కోట్లు అని తెలిపారు. టీ హబ్ సక్సెస్‌తో టీహబ్-2కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. టీహబ్-2లో 3.5 లక్షల స్కేర్ ఫీట్ స్పేస్ ఏర్పాటు చేసిందని చెప్పారు. 4 వేల ఐటీ ఎంటర్ ప్రెన్యూర్స్‌కు ఇంకుబేషన్ స్పేస్ చేశామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అవినీతికి తావు లేకుండా పారిశ్రామిక అనుమతులు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ఈ రెండున్నరేళ్లలో టీఎస్ ఐపాస్ కింద రూ. 54 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 3451 యూనిట్లు స్థాపించారు. 2.20 లక్షల మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటిస్థానాన్ని సాధించామని తెలిపారు. వరంగల్ - సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని గవర్నర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 27,481 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. 12 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వేస్తామన్నారు. 20 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు - 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ సహా ఆరోగ్యకార్డులు మంజూరు చేశామన్నారు. వీఆర్ ఏల వేతనం రూ. 10,500 వరకు, అంగన్ వాడీ ఉపాధ్యాయుల వేతనం రూ. 10,500 వరకు పెంచామని తెలిపారు.
కాగా, తెలంగాణ ఏర్పడ్డ ఆరునెలల్లోనే కరెంట్ కష్టాలను అధిగమించామని గవర్నర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతలు లేకుండా చేశామని చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. సాగుకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాతో రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. రాష్ర్టం ఏర్పడే నాటికి 6,574 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉన్నదిని గుర్తు చేశారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఈ రెండున్నరేళ్లలో 4,190 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సాధించామని స్పష్టం చేశారు. రానున్న మూడేళ్లలో 16,306 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది రైతులకు రూ. 29.101 కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు. రూ. 17 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశామని గుర్తు చేశారు. రుణమాఫీ ద్వారా 35.30 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. 17,057 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 330 గోడౌన్లను నిర్మించామని పేర్కొన్నారు. 11 నెలల్లోనే భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మించి రైతులకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 7 సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెప్పారు. మరో 14 ప్రాజెక్టుల నిర్మాణం చివరి దశలో ఉందన్నారు.
మిషన్ భగీరథ - మిషన్ కాకతీయ - హరితహారం కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తెలిపారు. మిషన్ కాకతీయ కింద 46,531 చెరువులను పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. ఫేజ్-1 - ఫేజ్-2 కింద 17,278 చెరువులను పునరుద్ధరించినట్లు చెప్పారు. మిగిలిన చెరువులను మూడో దశలో అభివృద్ధి చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తామన్నారు. ఇప్పటికే ఈ పనులు ఊపందుకున్నాయని తెలిపారు. 2017 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేస్తామన్నారు. హరితహారం కింద ప్రతి గ్రామంలో కనీసం 40 వేల చొప్పున మొక్కలు నాటేలా కార్యాచరణ చేపట్టామని చెప్పారు.
రాష్ట్రంలో రూ. 35 వేల కోట్లతో 30 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు గతం కంటే మెరుగ్గా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు రూ. 1000 పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఒంటరి మహిళలకు రూ. 1000 జీవనభృతి ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఆసరా పథకం కింద పెన్షన్ల కోసం రూ. 4,729 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 1.74 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ. 51 వేలు అందించామని తెలిపారు. ఈ పథకం సమర్థవంతంగా అమలవుతుందన్నారు. బాల్య వివాహాలను నివారించగలిగామని చెప్పారు. విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్నారు. రాష్ట్ర సాధనలో అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. హాస్టల్ విద్యార్థులకు సన్నిబియ్యంతో అన్నం పెడుతున్నామని తెలిపారు. విద్యార్థులకు ఫీజురియింబర్స్‌మెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఎంబీసీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ ఉచిత విద్యకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. రాబోయే విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మైనార్టీల కోసం 201 - ఎస్సీ మహిళల కోసం 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు - ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ఆధునీకరించామని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం చేపట్టామన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆకతాయిలను అరికట్టేందుకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు తర్వాత మహిళలపై వేధింపులు తగ్గాయన్నారు. హైదరాబాద్‌ను క్రైమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. జర్నలిస్టుల కోసం రూ. 50 కోట్లు, లాయర్ల కోసం రూ. 100 కోట్ల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం రూ. 100 కోట్ల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు.
యాదాద్రి - వేములవాడ - జోగులాంబ - భద్రాద్రి - ధర్మపురి - బాసర ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. గోదావరి - కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కుల వృత్తులకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. చేపలు - గొర్రెల పెంపకం చేపట్టామన్నారు. 3900లకు పైగా చెరువుల్లో చేప పిల్లల పెంపకం జరుగుతుందన్నారు. చేప పిల్లల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 27 కోట్లు వ్యయం చేసిందన్నారు. చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. కురుమ, యాదవ కుటుంబాలకు త్వరలోనే గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. ఉద్యానరంగం ప్రోత్సాహానికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/