జూబ్లీహిల్స్ రేప్ ఘ‌ట‌న‌పై గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్‌.. ఏమ‌న్నారంటే

Update: 2022-06-05 08:14 GMT
రాష్ట్రంలో సంచలనంగా మారిన  జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై గవర్నర్‌ తమిళిసై తీవ్రంగా స్పందించారు. రెండు రోజుల్లోగా పూర్తిస్తాయి నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని గవర్నర్ ఆదేశించారు. బాలికపై అత్యాచారం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఘటనపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందించాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు.

బాలికపై అత్యాచార ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. అత్యాచార ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్.. మీడియాలో వస్తున్న కథనాలను నిశితంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమంటూ తమిళిసై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి.

నింది తులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు.

మ‌రో ఇద్దరు అరెస్టు

జూబ్లిహిల్స్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ ఘటనకు సంబంధిం చి మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో మైనర్‌ నిందితుణ్ని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తు న్నారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Tags:    

Similar News