చెన్నైకి వచ్చేస్తున్న గవర్నర్

Update: 2017-02-08 16:34 GMT
తమిళనాడు అధికారపక్షం అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తన వైపు వేలు పెట్టే వరకూ వెళ్లిన వేళ.. ఆ రాష్ట్రానికి ఇన్ ఛార్జ్  గవర్నర్ గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా రాష్ట్రానికి రావటం లేదన్న అపవాదును తొలగించేందుకో.. చెన్నైకి వెళ్లకపోతే పరిణామాలు మరింత సంక్లిష్టంగా మారతాయన్న ఆలోచనో కానీ.. ఎట్టకేలకు చెన్నై ప్రోగ్రాంను ఫిక్స్ చేసేసుకున్నారు విద్యాసాగర్ రావు.

గురువారం ఉదయం ముంబయిలో బయలుదేరి మధ్యాహ్నానానికి చెన్నై చేరుకుంటారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం రేపు సాయంత్రం 5 గంటల వేళలో రాష్ట్ర డీజీపీ.. ఇంటెలిజెన్స్ ఐజీ.. చెన్నై నగర కమిషనర్ తదితర కీలక అధికారులతో గవర్నర్ సమావేవం కావటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో రాజకీయ పార్టీలకు అపాయింట్ మెంట్లు ఇవ్వకపోవటం గమనార్హం.

కీలక అధికారులతో సమావేశం కావటంలో గవర్నర్ అంతర్యం ఏమిటన్నది ఇక్కడ ప్రశ్నగా మారింది. గురువారం గవర్నర్  నగరానికి రానున్న నేపథ్యంలో.. ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్రపతి ముందు తన బలాన్ని ప్రదర్శించాలని.. గవర్నర్ తీరుపై ఫిర్యాదు చేయాలని భావిస్తున్న చిన్నమ్మ తాజా పరిణామాలతో తన ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకునే వీలుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. గవర్నర్ కేంద్రంగా తమిళనాడు రాజకీయాలు ముందుకు వెళ్లనున్నాయని చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News