కరోనా లాక్ డౌన్ తో కంపెనీలన్నీ మూతపడ్డాయి. చాలా సంస్థలు ఉద్యోగులను తీసేశాయి. జీతాల్లో కోత విధించాయి. ఇక నెలరోజులకు పైగా లాక్ డౌన్ తో దివాళా అంచున నిలిచాయి. కొన్ని కంపెనీలు దివాలా తీశాయి కూడా. లాక్ డౌన్ ఎత్తివేసినా ఓ ఆరు నెలల వరకు కంపెనీలు కోలుకునేలా లేవు. దీంతో కరోనా కల్లోలంతో వచ్చిన సంక్షోభాన్ని అరికట్టడానికి కేంద్రం సిద్ధమైంది.
కరోనాతో సంక్షోభంలో పడిపోయిన కంపెనీలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. దివాలా చర్యలకు గురికాకుండా ఆరు నెలల వరకూ కంపెనీలకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఆరు నెలలపాటు కంపెనీలకు దివాలా నుంచి మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ తాజాగా అనుమతించింది.
దీంతో ఇన్నాళ్లు దివాళా తీయగానే కేంద్రం స్వాధీనం చేసుకోవడమో లేక వాటికి ప్యాకేజీ ప్రకటించడమో చేసేంది. తాజాగా దివాలాకు సంబంధించిన డీఫాల్ట్ కేసులను 6 నెలల వరకు నమోదు చేయమని కేంద్రం తెలిపింది. ఈ మేరకు దివాళా కోడ్ కి సవరణ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.
దివాలా చర్యలు తీసుకోకుండా వాయిదా వేయడం కంపెనీలకు తిరిగి ఊపిరిలూదే నిర్ణయమని కార్పొరేట్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 6నెలలు పొడిగించడం ఆర్థిక బలాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. రుణాల పొందడానికి - బ్యాంకుల నుంచి ఉపశమనానికి ఈ చర్య ఉపకరిస్తుందంటున్నారు.