బాబు విసిగిస్తున్నారు.. అసలు కథ బయటకు!

Update: 2019-05-11 01:30 GMT
ఇది వరకే ఈ విషయం గురించి పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమీక్షలను తెలుగుదేశం పార్టీ నేతలే బోర్ గా ఫీల్ అవుతున్నారని ప్రత్యేక కథనాలను ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సమీక్షలు  అంటూ తమను వాయిస్తూ ఉన్నారని - అయిపోయిన పెళ్లికి మేళ తాళాలు ఎందుకు అన్నట్టుగా వారు రియాక్ట్ అవుతున్నారని పేర్కొనం జరిగింది.

ఎన్నికల కోసం ఒళ్లు గుళ్ల అయ్యేలా అందరూ కష్ట పడ్డారు. పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో కాస్త విరామమో తీరుసుకుని విహారానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని నేతలు భావిస్తూ ఉన్నారని - అయితే బాబు వారిని ఎక్కడకూ వెళ్లనిచ్చేది లేదన్నట్టుగా సమీక్షల పేరుతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడని ఇది వరకే పాఠకులకు వివరించడం జరిగింది.

ఆ అంశం చంద్రబాబు తాజా సమీక్షతో పూర్తిగా బయటకు వచ్చింది. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం  పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్ష అంటూ చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమానికి అక్కడి నేతలు హాజరు కాలేదు! శ్రీకాకుళం అసెంబ్లీ  సీటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో సహా పలువురు నేతలు ఈ సమీక్షకు డుమ్మా కొట్టారు.

తను లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానంటూ చంద్రబాబు నాయుడు కొన్నాళ్ల కిందట ప్రకటించారు. ఒక్కో నియోజకవర్గానికి సమీక్ష తేదీలను షెడ్యూల్ గా ప్రకటించారు. అయినా నేతలు ఈ సమావేశానికి హాజరు  కాకుండా డుమ్మా కొట్టారు.

గెలుపో..ఓటమో..ఆల్ రెడీ పోలింగ్ అయితే అయిపోయింది. అలాంటప్పుడు  ఈ సమీక్షలు ఎందుకు? అనేది లాజిక్కే. అయితే చంద్రబాబు మాత్రం సమీక్షల పేరుతో పార్టీ నేతలను వాయిస్తూ ఉన్నారు. దీంతో వారు గైర్హాజరై అసలు విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేశారు. తను పెట్టిన సమీక్ష సమావేశానికి హాజరు కాని వారి మీద ఆ సమావేశంలోనే ఫైర్ అయ్యారట చంద్రబాబు!
Tags:    

Similar News