తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ధాన్యం రాజకీయాల్లో దైన్యమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొంటారా .. కొనరా.. అంటూ.. కేసీఆర్ ఢిల్లీలో ఒక ఉద్యమమే చేసినంత పనిచేశారు. తీవ్రస్థాయిలో ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. 24 గంటల డెడ్‌లైన్ విధించారు. అయితే.. ఈ డెడ్‌లైన్ టైం అయిపోయింది. కానీ.. కేంద్రం నుంచి ఎలాంటి కబురూ వినిపించలేదు. దీంతో ఇప్పుడు ఏం చేయాలనేది కేసీఆర్‌కు అంతుచిక్కని వ్యవహారంగా మారిపోయింది.
వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలో గ్రామస్థాయి మొదలు ఆందోళనలు, దీక్షలు చేపట్టారు. సోమవారం ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు నిరసన దీక్ష చేశారు.
యాసంగి సీజన్కు సంబంధించి ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే పలు దఫాలుగా ప్రకటించింది. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో ఉప్పుడు బియ్యమే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రంతో చర్చలు జరిపింది. ఉప్పుడు, ముడి అన్న తేడా లేకుండా రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. 24 గంటల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని తేల్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వేదికగా డిమాండ్ చేశారు. ఆ గడువు ముగిసింది.
సీఎం ప్రసంగం అనంతరం ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంషు పాండే, హైదరాబాద్లో ఎఫ్సీఐ ప్రాంతీయ జనరల్ మేనేజర్ దీపక్ మిశ్రా మీడియా సమావేశం నిర్వహించి కొనుగోళ్ల అంశంపై మరోమారు స్పష్టత ఇచ్చారు. ఉప్పుడు బియ్యం తీసుకోబోమని తేల్చి చెప్పిన అధికారులు.. ముడి బియ్యానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో మధ్యాహ్నం సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై విస్తృతం గా చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అనుసరించాల్సిన వైఖరిపై దృష్టి సారించనున్నారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం అంటున్న పరిస్థితుల్లో ఏం చేయాలన్న విషయమై మంత్రిమండలిలో చర్చిస్తారు. కేంద్రం కోరుతున్నట్లు ముడి బియ్యం ఇచ్చే అవకాశం ఉందా..? లేదా..? ఒకవేళ ఉంటే ఏం చేయొచ్చు.. ఎంత వ్యత్యాసం వస్తుంది.. అన్న అంశాలపై చర్చిస్తారు.
కేంద్రంతో సంబంధం లేకుండా ధాన్యం సేకరించి మిల్లర్లు లేదా ఎగుమతిదారులకు విక్రయించే అవకాశం ఏ మేరకు ఉందన్న విషయమూ కేబినెట్లో చర్చించనున్నారు. అలా చేస్తే ఎంత మేర భారం పడనుందన్న విషయమై అంచనా వేయనున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ధాన్యం కొనుగోళ్లపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఎలా చూసుకున్నా.. కేసీఆర్‌కు ధాన్యం విషయం రాజకీయంగా తీవ్ర సంకటంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.