వెలకం చెప్పిన తీరుకు ఫ్లాట్ అయిపోతున్నారు

Update: 2016-06-24 12:21 GMT
పుట్టిల్లు పుట్టిల్లే. పుట్టింటికి దూరమై దశాబ్దాలు గడిచి పోయి.. ఎలాంటి భావోద్వేగ బంధాలు లేనట్లుగా తమ దారిని తాము బతికేసిన హైదరాబాద్ లోని ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని ఏపీకి వెళ్లాలని చెప్పినప్పుడు ఆందోళన చెందారు. ఎంత పుట్టిల్లు అయితే మాత్రం.. దశాబ్దాల తరబడి హైదరాబాద్ తో తమకున్న అనుబంధాన్ని వదిలేసి అమరావతికి ఎలా వెళతామంటూ అడిగినోళ్లు ఉన్నారు. అయినప్పటికి వెళ్లక తప్పని పరిస్థితుల్లో.. భారమైన హృదయంతో.. బాధాతప్త మనసులతో హైదరాబాద్ తో తమకున్న అనుబంధాన్ని  నెమరవేసుకుంటూ వెళ్లలేక వెళ్లలేక విడిచి పెట్టిన పరిస్థితి.

హైదరాబాద్ వదిలేసి గుంటూరుకు బయలుదేరేందుకు సేద్ధమైన ఉద్యోగులు పలువురు భావోద్వేగాన్ని ఆపుకోలేక భోరున విలపించిన పరిస్థితి. ఊరి కాని ఊరుకు వెళుతున్న తమ పరిస్థితి ఎలా ఉంటుందన్న భావనతో బయలుదేరిన వారికి అనూహ్య స్వాగత ఏర్పాట్లు ఉండటంతో ఆనందంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి వస్తున్న ఉద్యోగుల బస్సులు ఆగిన వెంటనే వారికి పూలదండలు.. మిరఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న వారిని చూసిన వారికి గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఎగిరిపోవటమే కాదు.. తమకు లభిస్తున్న వెల్ కంకు వారు విపరీతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధానికి తరలివెళ్లటం ఏమో అనుకున్నాం కానీ.. ఇంతటి ఆదరణ ఉంటుందని తాము అస్సలు అనుకోవటం లేదని పొంగిపోతున్నారు. అందుకే అనేది.. పుట్టిల్లు పుట్టిల్లే.
Tags:    

Similar News