హైదరాబాద్ విడిచి ఏపీ రాజధానికి వెళ్లాల్సిన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు ఎంతగా సతాయించింది తెలిసిందే. అలవాటైన మహానగరాన్ని వదిలి పెట్టి అక్కడెక్కడో ఉన్న గుంటూరు.. విజయవాడలకు ఏం వెళతామంటూ పెట్టాల్సిన పేచీలన్నీ పెట్టటం తెలిసిందే. ఒకదశలో గొంతెమ్మ కోర్కెల్ని తెర మీదకు తీసుకురావటం.. వారి తీరుపై ఏపీలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో.. హైదరాబాద్ విడిచి వెళ్లని పరిస్థితుల్లో వారంతా తట్టాబుట్టా సర్దుకొని ఏపీ రాజధానికి పయనమైన సంగతి తెలిసిందే.
దీనికి తోడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గట్టిగా వ్యవహరిస్తూ.. జూన్ 27 నాటికి హైదరాబాద్ లోని వివిధ కార్యాలయాలు ఏపీకి వచ్చేయాలంటూ డెడ్ లైన్ విధించటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ రాజధానికి పయనమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భావోద్వేగ బంధాన్ని తుంచుకుంటూ హైదరాబాద్ నుంచి బాధతో బయలుదేరిన ఏపీ ఉద్యోగులు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. తాము ఏ మాత్రం ఊహించని రీతిలో విజయవాడ.. గుంటూరులలో ఘన స్వాగతం లభించటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏన్నో సంవత్సరాల తర్వాత సొంతోళ్లను కలిస్తే ఎలాంటి పండుగ వాతావరణం ఉంటుందో దాదాపు అలాంటి పరిస్థితే ఉండటం.. తరలి వచ్చిన ఉద్యోగుల్ని పూలు జల్లి స్వాగతం పలుకుతున్న తీరు వారిని మరింత ఆనందానికి గురి చేస్తోంది.
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి తరలి వస్తున్న శాఖలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గడిచిన రెండు మూడు రోజుల్లో దాదాపు 20 శాఖలు ఏపీ రాజధానికి తరలి రాగా.. ఒక్క శనివారమే పది శాఖల కార్యాలయాలు గుంటూరు.. విజయవాడలలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత సత్కారాలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిన ఏపీ ఉద్యోగులు చెబుతున్నారు. గ్రాండ్ వెల్ కం చెప్పిన తమ వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా ఏపీ ఉద్యోగులు ఎంతమేర పని చేస్తారో..?