ఫోన్ లో అమ్మాయి ను చూస్తూ ఫోన్ కి తాళి కట్టిన వరుడు!

Update: 2020-04-29 09:50 GMT

కరోనా వైరస్ ... ఈ మహమ్మారి ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని మార్పులని తీసుకువచ్చింది. ఈ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. అయితే, మరికొందరు మాత్రం ఈ కరోనా సమయంలోనే ఎదో పెళ్లి చేసుకున్నాం అంటే చేసుకున్నాం అన్నట్టుగా పెళ్లి తంతుని ముగించేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి అంటే పందిళ్ళు - సందళ్ళు - చప్పట్లు - తాళాలు - తలంబ్రాలు  - బంధువులు అటేడుత‌రాలు - ఇటేడుత‌రాలు గుర్తుండిపోయేలా అంగ‌రంగ వైభ‌వంగా చేసేవారు .

ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది... బంధుమిత్రుల మధ్య ఘనంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కోట్లకి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ,ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అని ఇప్పుడు మరో ట్రెండ్ మొదలైంది. అదేమిటి అంటే ..ఆన్ లైన్ పెళ్లి. ఆన్లైన్ చాటింగ్ ..ఆన్ లైన్ బుకింగ్ చూసాం కానీ ఈ ఆన్ లైన్ పెళ్లి ఏంటి రా బాబు ! అని అనుకుంటున్నారా ? వధూ వరులు ఆన్ లైన్ లో చూసుకుంటే పురోహితుడు మంత్రాలు ఆన్ లైన్ లో చదివితే వధువుకు అక్కడే ఉన్నకుటుంబ సభ్యులు వరుడి పేరు మీద తాళి కట్టేస్తారు. ఇక దీంతో పెళ్లి తంతు ముగిసినట్టే .

తాజాగా ఓ జంట ఆదివారం నాడు ఆన్ లైన్ ద్వారా .. ఫోన్ లోనే పెళ్లి కానిచ్చేసింది. కేరళకు చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీజిత్‌.. అలప్పుజా లో ఉండే అంజనాకు వివాహం నిశ్చయం అయ్యింది. అయితే ఊహించని కరోనా లాక్ డౌన్ తో వధువు - వధువు తల్లి - సోదరుడు లక్నోలో చిక్కుకుపోయారు . ఇక దీంతో ఆన్ లైన్ లో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిన వరుడు అల‌ప్పుజాలో‌ వ‌ధువు అంజ‌నా బంధువు ఇంటికి వెళ్లాడు. అక్క‌డ వ‌ధువు తండ్రి ఉన్నారు. వరుడ్ని రిసీవ్ చేసుకుని పెళ్ళికి సిద్ధం చేశారు. పెళ్లికూతురు - ఆమె త‌ల్లి - సోద‌రుడు ల‌క్నోలో ఉన్నారు. అనుకున్న ముహూర్తం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం పన్నెండు గంట‌ల స‌మ‌యంలో వ‌ధూవ‌రులిద్ద‌రూ పెళ్లి బ‌ట్ట‌లు ధ‌రించి ఫోన్‌ లో లైవ్‌ లోకి వ‌చ్చారు. వెంట‌నే తాళిబొట్టు చేత‌ప‌ట్టుకుని వ‌రుడు ఫోన్‌ కు వెన‌క‌వైపున తాళి క‌ట్టాడు. ఫోన్ లో కనిపిస్తున్న వధువుకు కట్టినట్టు ఫీల్ అయ్యారు . అటు వ‌ధువు త‌ల్లి ఆమెకు మూడు ముళ్లు వేసింది. దీంతో వారి పెళ్లి జరిగిపోయింది. లాక్‌ డౌన్ ముగిసిన త‌ర్వాత రిసెప్ష‌న్‌ తో పాటు వివాహ రిజిస్ట్రేష‌న్ జ‌రుపుతామ‌ని కొత్త పెళ్లికొడుకు శ్రీజిత్ వెల్ల‌డించాడు. ఈ ఆన్ లైన్ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.



Full View
Tags:    

Similar News