ఉపఎన్నిక వాయిదా పడుతుండటంతో దళితబంధు పథకం అమలు విషయంలో కేసీయార్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కేసీయార్ హఠాత్తుగా దళితబంధు పథకాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలోని సుమారు 45 వేల ఎస్సీల ఓట్లను గంపగుత్తగా వేయించుకోవటమే టార్గెట్ గా సీఎం దళితబంధు పథకాన్ని పట్టుకొచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో ఈటల రాజేందర్ గురించి చాలా తక్కువగా అంచనా వేసినట్లున్నారు.
ఈటలను చాలా తక్కువగా అంచనా వేసిన కారణంగానే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసేశారు. దాంతో ఎంఎల్ఏ పదవికి కూడా ఈటల రాజీనీమా చేసేయటంతో ఆయనపై ఒక్కసారిగా సానుభూతి పెరిగిపోయింది. దానికితోడు ఇదే నియోజకవర్గంలో వరుసగా గెలుస్తుండటంతో ఈటలకు బాగా పట్టుకూడా ఉంది. ఈటల అనుకున్నదానికంటే బలవంతుడని అర్ధమైపోగానే వెంటనే కేసీయార్ గెలుపుకోసం నానా అవస్తలు పడుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు లాంచ్ చేయటం, దళతిబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
ఎంతో నమ్మకంతో ప్రకటించిన బంధు పథకమే ఇపుడు టీఆర్ఎస్ కొంపముంచేస్తుందా అనే అనునామాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఉపఎన్నికలు నవంబర్లోగా జరిగే అవకాశం లేదని తేలిపోయిందో వెంటనే పథకంలో మంజూరైన నిధులను ప్రభుత్వం నిలిపేసింది. ఎంపికచేసిన దళిత కుటుంబాల్లో తలా రు. 10 లక్షల ఆర్ధికసాయం చేయటమే దళితబంధు పథకం లక్ష్యం. ఇప్పటికే కొన్ని కుటుంబాలు ప్రభుత్వం నుండి తలా రు. 10 లక్షలు అందుకున్నాయి. అందుకున్న కుటుంబాలన్నీ డబ్బులు ఎప్పుడు అందుకున్నాయంటే ఎన్నికల కమీషన్ ప్రకటనకు ముందు.
కరోనా వైరస్, పండగల కారణంగా హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరిగే సూచనలు లేవని కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. దాంతో ఎప్పుడు జరుగుతాయో తెలీని ఎన్నికలు కావటంతో వెంటనే దళితబంధు పథకంలో ఎంపికైన కుటుంబాలకు డబ్బులు అందకుండా కలెక్టర్లు ఫ్రీజ్ చేసేశారు. ఖాతాలో పడిన డబ్బును లబ్దిదారులు డ్రా చేసుకోకుండా కలెక్టర్లు అడ్డుకున్నారు. దాంతో లబ్దిదారులంతా ప్రభుత్వంపై మండిపోతున్నారు. కారణం ఏమిటంటే లబ్దిదారుల్లో కొందరి చేతికి డబ్బులు అందితే మరికొందరి చేతికి అందకపోవటమే కారణం.
ఈ విషయాలు ఇలాగుంటే నియోజకవర్గంలో పరిస్ధితులను అడ్వాంటేజ్ తీసుకునేందుకు ఈటల శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దళితబంధు పథకంలో లబ్దిదారుల అవస్తలను ఎత్తిచూపటం ద్వారా దళితుల్లో కేసీయార్ పై అసంతృప్తిని రేకెత్తిస్తున్నారు. అయితే ఉపఎన్నిక జరిగేంత వరకు జనాల్లో కేసీయార్ వ్యతిరేకతను మైన్ చేయటం ఈటలకు సాధ్యమేనా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తుండటమే.
పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా రెండోస్ధానంలో నిలబడింది. కాబట్టి ఇపుడు కూడా గెలవకపోయినా కనీసం రెండోస్ధానాన్ని మైన్ టేన్ చేస్తే చాలన్నట్లుగా ఉంది కాంగ్రెస్ నేతల ఆలోచన. అందుకనే కాంగ్రెస్ పార్టీ కోసమని బాగా ప్రచారం చేస్తున్నారు. ఉపఎన్నిక ఇప్పట్లో జరగటంలేదు కాబట్టి అభ్యర్ధిని కూడా ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ పుంజుకునే కొద్దీ ముందు దెబ్బపడేది ఈటలపైనే అనే ప్రచారం పెరుగుతోంది. మరి ఉపఎన్నిక ఆలస్యం ఎవరిపైన ఎలాంటి ప్రభావం పడుతుందో అనే విషయంలో క్లారిటీ లేదనే చెప్పాలి.