ఏ భాషలో తీసిన సినిమా అయినా ఫెయిల్ అయితే.. దాన్ని రీమేక్ చేసే సాహసం చేస్తారా? అంటే.. ఛాన్సే లేదని చెబుతారు. అసలు మెదడు ఉండేవాడు ఆ పని చేస్తారా? అని ఎదురు ప్రశ్నిస్తారు కూడా. కానీ.. ప్రపంచంలో పలు దేశాల్లో విఫలమైన జీఎస్టీని దేశంలో పండుగ మాదిరి ప్రవేశ పెట్టిన ఘనత ఎవరిదంటే మోడీ సర్కారుదేనని చెప్పాలి. పలు దేశాల్లో ఫెయిల్ అయినా జీఎస్టీని దేశంలో ప్రవేశ పెట్టాలనుకున్నప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కానీ.. అలాంటి కసరత్తు ఏమీ లేకుండా.. పలువురు చేసిన వినతుల్ని పక్కన పెట్టేసి మరీ జీఎస్టీని తెచ్చేసిన కొత్త పన్ను విధానం ఎఫెక్ట్ ఎంతన్న విషయం ఇప్పటికే అర్థమైంది. జీఎస్టీని తీసుకొచ్చి మూడు నెలలు అవుతున్న వేళ.. పలు సూచనలు వస్తున్న నేపథ్యంలో మరోసారి సమావేశమైన మండలి.. కీలక నిర్ణయాల్ని తీసుకుంది. అందులో ముఖ్యమైంది.. ప్రస్తుతం వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువులు.. వస్తుసేవల పన్నుల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం. జీఎస్టీ విధానం చాలా సరళంగా ఉంటుందని భావిస్తే.. అందుకు భిన్నంగా చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాపార వర్గాల నుంచి తీవ్రస్థాయిలో ఫిర్యాదులు అందుతున్న వేళ.. మార్పులు చేసే దిశగా జైట్లీ అండ్ కో నడుం బిగించింది. వ్యాపారులు చెబుతున్న పన్ను చెల్లింపు విధానం కష్టంగా ఉందన్న సూచనకు స్పందించి.. పరిష్కరించినట్లుగా వెల్లడించారు.
తాజాగా పన్నుభారం తగ్గించిన 27 వస్తు.. వస్తు సేవల విషయానికి వస్తే..
12% నుంచి 5%కి తగ్గించినవి
+ బ్రాండెడ్ కాని నమ్ కీన్
+ బ్రాండెడ్ కాని ఆయుర్వేద మందులు
+ ఎండు మామిడి బద్దలు
+ ఖాక్రా (తినుబండారాలు)
+ ఐసీడీఎస్ పథకం కింద స్కూళ్లల్లో పిల్లలకు ఇచ్చే ఆహార పొట్లాలు
+ సాదా చపాతీ/రోటీ
+ జరీ.. గిల్టు నగలు
+ ఆహార పదార్థాల తయారీ జాబ్ వర్కులు
+ ప్రింటింగ్ వస్తువులు
+ సాగునీటి ప్రాజెక్టుల ఖర్చులు అదుపు చేసేలా కాంట్రాక్టర్ల మీద విధించే పన్ను
+ మూడు పీసులు ఉన్న సల్వార్ సూట్
+ ఒరిజినల్ జరీ
18% నుంచి 5%కి తగ్గించినవి
+ ప్లాస్టిక్ వేస్ట్
+ రబ్బర్ వేస్ట్
+ పేపర్ వేస్ట్
+ ప్రభుత్వ పథకాల కింద పేదలకు తయారు చేసే ఆహార పదార్థాలు
18% నుంచి 12%కి తగ్గించినవి
+ చేతితో తయారు చేసే నూలు
+ కుట్టుమిషన్ల దారం
+ నైలాన్ - పాలిస్టర్ వగైరా
+ కృత్రిమ ఫిలమెంట్ దారం వగైరా
28% నుంచి 18%కి తగ్గించినవి
+ స్టేషనరీ (పేపరు క్లిప్పులు - ట్యాగులు తదితరాలు)
+ ఇంటి గచ్చులుగా ఉపయోగించే రాళ్లు (గ్రానెట్ - పాలరాయి కాకుండా)
+ డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు
+ పంపుల విడిభాగాలు
+ పోస్టర్ కలర్లు.. మోడలింగ్ పేస్ట్
28% నుంచి 5 %కి తగ్గినవి
+ ఈ-వ్యర్థాలు
+ హార్డ్ రబ్బర్ వేస్ట్