కేంద్రమంత్రికి కరోనా భయం...ఏమైందంటే ?

Update: 2020-04-27 17:30 GMT
sisindri kumar
    
12:27 PM (4 minutes ago)
    
to me
కేంద్రమంత్రికి కరోనా భయం !

కేంద్రమంత్రికి కరోనా భయం ... ఏమైందంటే ?

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా భయం ....!

కేంద్రమంత్రికి కరోనా భయం ..కార్యాలయం మూసివేత !

కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచమే స్తంభించిపోయింది. ఇప్పటికే  కరోనా పై పోరాడుతున్న  పలువురు వైద్యులు, పోలీసు అధికారులు వైరస్ ‌బారిన పడగా... తాజాగా కేంద్రమంత్రిని సైతం కరోనా భయం వెంటాడుతోంది.  కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్‌ ఓఎస్ ‌డీ (ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషన్‌ డ్యూటీ) సెక్యూరిటీకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అ‍య్యింది. దీంతో మంత్రి వ్యక్తిగత సిబ్బందిలో ఒక్కసారిగా కరోనా‌ కలకలం రేపింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రమంత్రి ఓఎస్ ‌డీ వద్ద ఆఫీస్‌ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో , మంత్రి కార్యాలయ సిబ్బంది కరోనా అనుమానంతో  ఢిల్లీ ఎయిమ్స్ ‌కి తరలించి, అక్కడ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించగా .. కరోనా పాజిటివ్‌గా తేలింది. దీనితో కేంద్రమంత్రి హర్షవర్థన్‌ ఓఎస్ ‌డీ తో సహా, అతని కుటుంబం, సమీపంగా మెలిగిన వ్యక్తులను అధికారులు స్వీయ నిర్బంధం పాటించాలని ఆదేశించారు.

మరోవైపు వీరిలో ఎవరైనా మంత్రి హర్షవర్థన్ ‌ను ప్రత్యక్షంగా కలిశారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిలో ఏమాత్రం అనుమానం ఉన్నా.. ముందు జాగ్రత్తగా కేంద్రమంత్రికి సైతం కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మ‌రోవైపు కేంద్ర‌మంత్రి కార్యాల‌యాన్ని అధికారులు మూసివేశారు. అత‌నితో స‌న్నిహితంగా ఉన్న‌వారిని కూడా హోం క్వారంటైన్‌ లో ఉండాల‌ని సూచించారు.

కాగా ఢిల్లీలో ఇప్పటివరకు 2625 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 54 మంది మ్యత్యువాత పడ్డారు. ఢిల్లీ లో లాక్ డౌన్ ను చాలా పటిష్టంగా అమలు చేయాలనీ సీఎం కేజ్రీవాల్ అధికారులకి ఆదేశాలు జారీ చేసారు. దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేల‌కు చేరువ‌లో ఉంది. దేశంలో మొత్తం 880 మందికిపైగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌ర‌ణించారు.
Tags:    

Similar News